ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా అన్ని పోషకాలు శరీరానికి ఎంత ముఖ్యమో.కొలెస్ట్రాల్ కూడా అంతే ముఖ్యం.
కానీ, అదే కొలెస్ట్రాల్ ఎక్కువైతే.ప్రాణానికే ముప్పుగా మారుతుంది.
అధిక కొలెస్ట్రాల్ కారణంగా గుండె పోటు, ఇతర గుండె సంబంధిత జబ్బులతో పాటు స్థూలకాయం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి.ఇక కొలెస్ట్రాల్ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి.
అయితే కొందరికి కొలెస్ట్రాల్ పెరగడానికి సరైన కారణాలు కూడా తెలియవు.
అలాంటి వారు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే విషయాలు తెలుసుకోవాలి.
ఎందుకంటే, కొలెస్ట్రాల్ పెరగడానికి కారణాలు ఏంటీ, ఏ ఏ అలవాట్ల వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా నేటి కాలంలో చాలా మందికి నాన్ వెజ్ లేనిదే భోజనం చేయలేరు.
కానీ, ప్రతి రోజు మాంసాహారం తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ.కాబట్టి, ప్రతి రోజు కాకుండా వారంలో ఒకటి, రెండు సార్లు మాంసాహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
అలాగే మద్యం అలవాటు ఉన్నా కూడా కొలెస్ట్రాల్ పెరిగిపోతోంది.ఫలితంగా రక్తపోటు, లివర్ డ్యామేజ్ వంటి సమస్యలు తలెత్తుతాయి.తక్కువ ఫైబర్ ఉంటే ఆహారాలు తీసుకోవడం కూడా కొలెస్ట్రాల్ పెరగడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు.ఒత్తిడి వల్ల కూడా కొలెస్ట్రాల్ పెరుగుతుంది.అదెలా అంటే ఒత్తిడిగా ఉన్న సమయంలో ఫుడ్ అతిగా తీసుకోవడమో, స్మోకింగ్ చేయడమో చేస్తుంటారు.ఫలితంగా, కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
అందువల్ల, ఒత్తిడిని ఎంత అదుపులో ఉంచుకుంటే అంత మంచిది.
ఇక కేకులు, కుకీలు, స్వీట్లు వంటివి చూస్తే నోరు ఆపుకోలేరు చాలా మంది.కొందరైతే మోతాదుకు మంచి తీసుకుంటారు.కానీ, వీటిలో అధిక మోతాదులో ఈస్ట్, పంచదార మరియు ఇతర ప్రాసెస్డ్ పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.
వీటి వల్ల కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలు పెరుగుతాయి.మధుమేహం మరియు థైరాయిడ్ వంటి కొన్ని వ్యాధుల కారణంగా కూడా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతాయి.
కాబట్టి, మధుమేహం మరియు థైరాయిడ్ వంటి వ్యాధులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.