ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వినియోగం ఏ స్థాయిలో పెరిగిందో సోషల్ మీడియా ట్రోల్స్ సైతం అదే స్థాయిలో పెరిగాయి.ఏ చిన్న విషయం నచ్చకపోయినా, పొరపాటు జరిగినా అభిమానులు దారుణంగా టార్గెట్ చేసి మరీ ట్రోల్స్ చేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి.
అయితే యానిమల్ (Animal)రిలీజ్ తర్వాత తనపై దారుణంగా ట్రోలింగ్ జరిగిందని త్రిప్తి డిమ్రి వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
యానిమల్ సినిమాకు ముందు విమర్శల గురించి నాకు తెలియదని ఆ సినిమా రిలీజైన తర్వాతే చాలామంది ట్రోల్స్ చేశారని త్రిప్తి డిమ్రీ తెలిపారు.
మెయిన్ స్ట్రీమ్(Main stream) లో ఉండే సైడ్ ఎఫెక్త్స్ ఇవేనని ఆమె చెప్పుకొచ్చారు.అయినప్పటికీ నేను సంతోషంగాఉన్నానని ఆమె అన్నారు.బుల్ బుల్, కాలా సినిమాల సమయంలో నన్ను ఎవరూ విమర్శించలేదని త్రిప్తి చెప్పుకొచ్చారు.ఆ సమయంలో ఏ పోస్ట్ కింద చూసినా పాజిటివ్ కామెంట్లే వినిపించేవని ఆమె అన్నారు.
యానిమల్ సినిమా సమయానికి మాత్రం ఆ పరిస్థితి మారిందని త్రిప్తి (tripti)పేర్కొన్నారు.ఆ కామెంట్లను చూస్తే నాకు పిచ్చెక్కేదని త్రిప్తి వెల్లడించారు.నేను ఏ తప్పు చేశానని ఇంతలా తిడుతున్నారని నేను ఫీలయ్యానని ఆమె వెల్లడించారు.యానిమల్ రిలీజ్( animal release) తర్వాత రెండు మూడు రోజుల పాటు ఏడ్చానని త్రిప్తి పేర్కొన్నారు.
ఇంత ట్రోలింగ్ ఉంటుందని నేను ఊహించలేదని ఆమె పేర్కొన్నారు.
నేను చాలా సెన్సిటివ్ అని త్రిప్తి పేర్కొన్నారు.నేను చాలా సెన్సిటివ్ అని ఎవరితో అయినా ఫైట్ చేయాల్సి వస్తే నా గదిలోకి వెళ్లి తాళం వేసుకుంటానని ఆమె చెప్పుకొచ్చారు.నేను అలాంటి దాన్నని విపరీతమైన ట్రోల్స్ చూసిన తర్వాత వర్క్ పై సైతం సరిగ్గా శ్రద్ధ పెట్టలేదని ఆమె పేర్కొన్నారు.