జామాకులేగా అని తీసిపారేయకండి.. అవి అందించే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది ఇష్టంగా తినే పండ్లలో జామకాయలు ఒకటి.చౌక ధరకే లభించిన జామకాయలు చాలా రుచికరంగా ఉంటాయి.

 Amazing Health Benefits Of Guava Leaves Details, Guava Leaves, Guava Leaves Hea-TeluguStop.com

మరియు బోలెడన్ని పోషకాలను కలిగి ఉంటాయి.అయితే జామకాయలే కాదు జామ ఆకులు( Guava Leaves ) కూడా మన ఆరోగ్యానికి తోడ్పడతాయి.

సరైన అవగాహన లేకపోవడం వల్ల కొందరు జామాకులేగా అని తీసి పారేస్తుంటారు.కానీ అవి అందించే ప్రయోజనాలు తెలిస్తే క‌చ్చితంగా ఆశ్చర్యపోతారు.

జామ ఆకుల్లో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.అందువ‌ల్ల జామ ఆకులు ఇమ్యూనిటీ బూస్ట‌ర్ గా( Immunity Booster ) ప‌ని చేస్తాయి.

సీజ‌న‌ల్ వ్యాధుల‌కు అడ్డుక‌ట్ట వేస్తాయి.జామ ఆకుల్లో విటమిన్ ఎ ఉంటుంది.

ఇది దృష్టి లోపాల‌కు చెక్ పెడుతుంది.కంటి చూపును( Eye Sight ) మెరుగుప‌రుస్తుంది.

అలాగే త‌ర‌చూ ఒత్తిడికి గుర‌య్యే వారికి జామ ఆకులు ఒక వ‌రమనే చెప్పుకోవ‌చ్చు.జామ ఆకుల‌తో టీ( Guava Leaves Tea ) త‌యారు చేసుకుని తీసుకుంటే.

అందులో ఉండే యాంటీ యాంగ్జయిటీ గుణాలు ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తాయి.మైండ్‌ను ప్ర‌శాంతంగా మారుస్తాయి.

Telugu Diabetes, Eye, Guava, Guava Benefits, Guava Tea, Tips, Heart Diseases, La

జామ ఆకుల‌ను నేరుగా తిన‌డం లేదా టీ రూపంలో తీసుకోవ‌డం వ‌ల్ల గుండె జ‌బ్బుల‌కు దూరంగా ఉండ‌వ‌చ్చు.జామ ఆకులు ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి మరియు మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి.అలాగే మ‌ధుమేహం( Diabetes ) ఉన్న వారు రోజుకు రెండు జామ ఆకులు తింటే చాలా మేలు జ‌రుగుతుంది.జామ ఆకులు గ్లూకోజ్ స్థాయిలను స్థిరీకరించగలవు మరియు భోజనం తర్వాత రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తాయి.

Telugu Diabetes, Eye, Guava, Guava Benefits, Guava Tea, Tips, Heart Diseases, La

మ‌హిళ‌లు నెల‌స‌రి స‌మ‌యంలో జామాకుల టీ తాగితే బాడీ పెయిన్స్ నుండి రిలీఫ్ పొందుతారు.అంతేకాదండోయ్‌.జామ ఆకుల్లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.ఇవి డయేరియాను నయం చేయగలవు మరియు కడుపు తిమ్మిరి నుండి ఉపశమనాన్ని అందిస్తాయి.జామ ఆకుల‌ను న‌మ‌ల‌డం వ‌ల్ల పంటి నొప్పి మరియు చిగుళ్ల సమస్యలు సైతం దూరం అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube