ప్రస్తుతం మారుతున్న కాలంతో పాటు అనేక విధివిధానాలు మారుతున్నాయి.కానీ సమాజంలో మనిషికి మనిషికి మధ్య ఉండే కులము, మతము అన్న భేదం మాత్రం ఇంకా చాలాచోట్ల మారడం లేదు.
పైగా కుల మత బేధాలు అంటూ అనేక రకాలుగా దారుణమైన సంఘటనలు జరుగుతూనే ఉంటాయి.అంతే కాకుండా ఇంటి పేరును బట్టి అవతల వ్యక్తి ఏ కులానికి చెందినవాడు అన్నట్లుగా చివరికి వారి పేర్లను కూడా అలా వచ్చేలాగా పెట్టుకుంటూ ఉన్నారు కొందరు.
అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనుషులంతా ఒక్కటే అన్న విషయానికి నిదర్శంగా ఒక తండ్రి చేసిన పనికి అందరూ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.ఈ క్రమంలో తన కొడుకు పేరుతో( Son Name ) మనుషులంతా ఒక్కటే అన్న విషయానికి నిదర్శనంగా ఉండేలాగా ప్లాన్ చేశాడు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళ్తే.అనంతపురం జిల్లా తాడిపత్రికి( Tadipatri ) చెందిన సిహెచ్ రాఘవేంద్ర( CH Raghavendra ) అనే వ్యక్తి తన కొడుకుకి కాస్త విడ్డురంగా పేరు నామకరణం చేశాడు.ఇందుకు గల ముఖ్య కారణం ఏమిటి అంటే.తాను చదువుకునే వయసులో స్కూల్లో కుల, మత బేధాలు చూపించేవారు కాదు.కానీ., బయట సమాజంలో మాత్రం అలాంటి విభిన్నమైన తేడాలను చూపించేవారు అంటూ.
ఆ సమయంలో నేను చాలా బాధపడ్డానని.దీంతో తన కుమారుడికి డిఫరెంట్ గా పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.

ఈ తరుణంలో తన కుమారుడికి “వన్ టూ సిక్స్”( One Two Six ) అని పేరు నామకరణం చేశాడు.ఇక ” వన్ టూ సిక్స్” అనే పేరుకు గల అర్థం విషయానికి వస్తే.“వన్” అంటే ఐ, “టూ” అంటే యామ్, “సిక్స్” అంటే ఇండియన్ అని అర్ధం అందుకే తన కుమారుడికి ఆ పేరు పెట్టినట్టు తెలియజేశాడు.కేవలం పేరు పెట్టడమే కాకుండా ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికెట్ లాంటి ముఖ్యమైన డాక్యుమెంట్లలో కూడా అదే పేరును నమోదు చేయించాడు.
“ఐ యామ్ ఇండియన్”( I Am Indian ) అని అర్థం వచ్చేలాగా మనుషులందరూ ఒకటే అని చాటి చెప్పడానికే ఇలా తన కొడుకుకి పేరు పెట్టినట్లు రాఘవేంద్ర తెలిపాడు.ఇక ఈ సంఘటన చూసిన కొంత మంది నెటిజన్స్ గుడ్ ఐడియా అంటూ కామెంట్ చేస్తున్నారు.







