ప్రస్తుతం దేశవ్యాప్తంగా దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.ఈ తొమ్మిది రోజులు పూజలు ప్రత్యేక కార్యక్రమాలతో ఊరువాడ అంతా కూడా సందడిగా నెలకొంటుంది.
కొన్ని ప్రాంతాలలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ.అంగరంగ వైభవంగా నవరాత్రి వేడుకలను జరుపుకుంటారు.
అయితే., తాజాగా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఘర్బా డాన్స్( Garba Dance ) చేస్తూ ఒక ప్రముఖ కళాకారుడు మృతి చెందిన సంఘటన పూణేలో( Pune ) చోటు చేసుకుంది.
ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.
ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.మహారాష్ట్ర పూణె జిల్లాలోని ఖేడ్‌లో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రముఖ కళాకారుడు అశోక్ మాలీ( Ashok Mali ) గర్బా ప్రదర్శన చేస్తూ తీవ్రంగా చాతిలో నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.“గర్బా కింగ్” గా( Garba King ) ప్రసిద్ధి చెందిన అశోక్ మాలి ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో డాన్స్ చేస్తూ సడన్ గా కుప్పకూలి మృతి చెందాడు.వైరల్ అవుతున్న వీడియోలో జనం ముందుగా ఎంతో ఉత్సాహంగా అశోక్ మాలి హుషారుగా డాన్స్ చేయడం మనం చూడవచ్చు.అతడితో పాటు అతని కుమారుడు కూడా డాన్స్ వేయడం.
చుట్టూ ఉన్న జనాలు అంతా కూడా చప్పట్లు కొడుతూ, మొబైల్ లో వీడియోలు తీయడం కూడా మనం చూడవచ్చు.
అలా డాన్స్ చేస్తూ ఉన్న ఆయన ఒక్కసారిగా అశోక్ మాలికి ఛాతిలో నొప్పి రావడంతో అసహనంగా అనిపించడం.ఆ తర్వాత క్షణాల వ్యవధిలోనే కుప్పకూలిపోయాడు.అయితే.
, హుటాహుటిగా అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ తెలియజేశారు.ఈ ఘటనకు సంబంధించి చకన్ పోలీస్ స్టేషన్ లోని సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ వాఘ్ మాట్లాడుతూ.
ఈ విషాద సంఘటన ఖేడ్ ప్రాంతంలో జరిగిందని పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేసినట్లు తెలియజేశారు.అకస్మాత్తుగా గుండెపోటు( Heart Attack ) రావడం వల్లనే అతడు మరణించాడని ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలియచేసారు.