అమెరికా అధ్యక్ష ఎన్నికలు : లైవ్ షోలో బీర్ తాగిన కమలా హారిస్.. వీడియో వైరల్

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతుంది.నవంబర్ 5కు మరో నెల రోజులే గడువు ఉండటంతో డెమొక్రాటిక్, రిపబ్లికన్ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.

 Kamala Harris Cracks Open A Beer During Late Show In Tv Details, Kamala Harris ,-TeluguStop.com

డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) తన వయసును కూడా లెక్క చేయకుండా ర్యాలీలు, బహిరంగ సభలతో దూసుకెళ్తున్నారు.తనపై హత్యాయత్నం జరిగిన పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో బిలియనీర్ ఎలాన్ మస్క్‌,( Elon Musk ) తన రన్నింగ్ మెట్ జేడీ వాన్స్‌తో కలిసి భారీ ప్రచార సభ నిర్వహించారు.

అటు కమలా హారిస్( Kamala Harris ) సైతం ఏమాత్రం తగ్గడం లేదు.వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూ మీడియా ద్వారా తన ప్రణాళికలను దేశ ప్రజలతో పంచుకుంటున్నారు.

అయితే ఓ షోలో పాల్గొన్న ఆమె.లైవ్‌లోనే బీరు( Beer ) తాగి షాకిచ్చారు.

Telugu America, Beer, Democrats, Donald Trump, Elon Musk, Kamala Harris, Kamalah

ది లేట్ షో విత్ స్టీఫెన్ కోల్‌బర్ట్‌లో( The Late Show with Stephen Colbert ) పాల్గొన్నప్పుడు ఆమె బీరు తాగారు.ఓటర్లతో మరింత కనెక్ట్ కావడానికి అర్ధరాత్రి పూట టెలివిజన్ షోలో కనిపించి కమలా హారిస్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు.కోల్‌బర్ట్ ప్రశ్నలకు సరదాగా ఆన్సర్ ఇచ్చిన ఆమె.ఆ వెంటనే మిల్లర్ హై లైఫ్ అనే బీర్ కేన్ తెరిచారు.గాజాలో ఇజ్రాయెల్ – హమాస్ మధ్య జరుగుతున్న యుధ్దంపై ఈ ఇంటర్వ్యూలో చర్చించారు.ఈ సంఘర్షణకు తక్షణ పరిష్కారాన్ని కనుగొనలేనప్పటికీ.అమెరికా తన శాయశక్తులా కృషి చేస్తోందని, ఆశను కోల్పోమని కమలా హారిస్ అన్నారు.

Telugu America, Beer, Democrats, Donald Trump, Elon Musk, Kamala Harris, Kamalah

అలాగే జర్నలిస్ట్ బాబ్ వుడ్‌వార్డ్ తాజా పుస్తకంపై వచ్చిన ఆరోపణలపైనా ఆమె స్పందించారు.ట్రంప్‌పైనా పనిలో పనిగా విమర్శలు గుప్పించారు.అమెరికాను కోవిడ్ మహమ్మారి వణికిస్తున్న సమయంలో అరుదైన టెస్టింగ్ కిట్‌లను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు పంపారని ఆమె ఆరోపించారు .తద్వారా మిలియన్ల మంది అమెరికన్ల జీవితాలతో ఆడుకున్నారని కమలా హారిస్ తెలిపారు.తాను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ అడుగుతున్నానని.

ఆ రోజులు ఎలా ఉండేవో గుర్తుందా అని ప్రశ్నించారు.కోవిడ్ సంక్షోభాన్ని ట్రంప్ సరిగా నిర్వహించలేదని ఆమె ఎద్దేవా చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube