దేశవ్యాప్తంగా నవరాత్రి పండుగ( Navarathri Festival ) ఉత్సాహం వెల్లివిరుస్తున్నందున, నృత్య ప్రియులు లైవ్ సంగీతం, సాంప్రదాయ నృత్య కదలికలతో జరుపుకోవడానికి గార్బా ఈవెంట్‌లకు తరలివస్తున్నారు.గార్బాను( Garba Dance ) ఆనందిస్తున్న వ్యక్తుల వీడియోలతో సోషల్ మీడియా సందడి చేస్తోంది.
కానీ., ఒక ప్రత్యేక వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది.
ఒక వ్యక్తి పుస్తకం చదువుతూ( Reading Book ) గార్బా డ్యాన్స్ చేస్తున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
బ్రౌన్ కుర్తా, జీన్స్ ధరించిన యువకుడు పుస్తకాన్ని పట్టుకుని అప్రయత్నంగా గార్బా సర్కిల్‌లో డ్యాన్స్ చేస్తున్నాడు.ఈ వీడియోని ప్రత్యేకంగా నిలబెట్టే విషయం ఏమిటంటే, మనిషి పుస్తకంలో పూర్తిగా లీనమై ఉన్నట్లు మనకు కనపడుతుంది.పుస్తకం వైపు అతడి దృష్టిని పక్కకి పోనివ్వకుండా, అతను డ్యాన్స్ స్టెప్పులను కాస్త అటుఇటుగా అనుసరించాడు.అతని స్నేహితులు అతని అసాధారణ ప్రవర్తనను చూసి నవ్వుతూ ఉండడం.
, అతని చుట్టూ ఉన్న ఇతరులు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోతారు.చుదువుపై అంతటి శ్రద్ధ ఉన్నప్పటికీ, మనిషి ఏ మాత్రం మిస్ కాకుండా డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు.
15 సెకన్ల చిన్న క్లిప్ అతి త్వరగా వైరల్ అయ్యింది.దాదాపు 600,000 వ్యూస్ వచ్చాయి.చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఆ వ్యక్తి ప్రత్యేకమైన అధ్యయనం, అతడి నృత్యాన్ని వినోదభరితంగా చూస్తున్నారు.కొంతమంది వ్యక్తులు అతనిని “ప్రమాదకరమైన స్టంట్” చేస్తున్నాడంటూ కామెంట్ చేసారు.
చాలామంది అతని చేష్టలు వినోదాత్మకంగా అలాగే రిఫ్రెష్‌గా ఉన్నాయని అన్నారు.కొంతమంది వినియోగదారులు ఆ యువకుడు ఏ పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నాడో, డ్యాన్స్ చేసేటప్పుడు కూడా అతను చదువుకోవాల్సిన అవసరం ఉందని చమత్కరించారు.
మరొక వినియోగదారు, “UPSC కే లియే సిద్ధం కర్ రహా హై ( UPSC పరీక్షకు సిద్ధమవుతున్నాడు) అని వ్యాఖ్యానించగా, అతను నవంబర్ పరీక్షలకు సిద్ధమవుతున్న CA విద్యార్థి అయి ఉండవచ్చని మరొకరు కామెంట్ చేసారు.