దేవర మూవీ( Devara ) సక్సెస్ మీట్ ఔట్ డోర్ లో జరగకపోయినా ఇండోర్ లో ఒకింత గ్రాండ్ గానే జరిగిన సంగతి తెలిసిందే.ఈ మీటింగ్ లో ఎన్టీఆర్ ఆర్ట్స్ హరి గురించి తారక్ చేసిన కామెంట్స్ ఒకింత సంచలనం అయ్యాయి.
అయితే దేవర సినిమాకు యువసుధ ఆర్ట్స్, ఎన్టీఅర్ ఆర్ట్స్ ( Yuvasudha Arts, NTR Arts )నిర్మాణంలో కీలకంగా వ్యవహరించాయి.యువసుధ ఆర్ట్స్ బ్యానర్ కు మిక్కిలినేని సుధాకర్ అధినేత కాగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బాధ్యతలను నందమూరి హరి చూసుకుంటున్నారు.
అయితే హరి ప్రమేయం ఉండటం నిర్మాత సుధాకర్ కు ఇష్టం లేదని అందువల్లే ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయని సమాచారం అందుతోంది.సినిమాటోగ్రాఫర్ రత్నవేలు విషయంలో సైతం ఎన్టీఆర్, కొరటాల శివ( NTR, Koratala Shiva ) అండర్ స్టాండింగ్ కు రావాల్సి ఉందని తెలుస్తోంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ దేవర2 సినిమాను ( Devara 2 movie )వచ్చే ఏడాది మొదలుపెట్టాలని భావిస్తుండగా తారక్ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయో లేదో చూడాల్సి ఉంది.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ పరంగా అంతకంతకూ ఎదుగుతుండగా తన సినిమాల విషయంలో, బడ్జెట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.దేవర సీక్వెల్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.

దేవర సీక్వెల్ లో సైతం అండర్ వాటర్ సీక్వెన్స్ లు ఎక్కువగానే ఉండనున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.దేవర సీక్వెల్ కచ్చితంగా హిట్ గా నిలుస్తుందని కొరటాల శివ నమ్మకం చూసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం సంతోషిస్తున్నారు.దేవర2 నిజంగా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందో లేదో చూడాల్సి ఉంది.దేవర సీక్వెల్ లో విజువల్ ఎఫెక్ట్స్ కు ఒకింత ఎక్కువగా ప్రాధాన్యత ఉండనుందని సమాచారం అందుతోంది.
దేవర సీక్వెల్ షూట్ సమయానికి చిన్నచిన్న మనస్పర్ధలు ఏవైనా ఉంటే అవి తొలగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి.