శాన్ ఫ్రాన్సిస్కో: బస్సును గుద్దిన సెల్ఫ్-డ్రైవింగ్ కారు.. ఆందోళనలో ప్రజలు..?

ఇటీవల శాన్‌ఫ్రాన్సిస్కోలో( San Francisco ) ఒక ప్రమాదం జరిగింది. వేమో కంపెనీ( Waymo ) తయారు చేసిన ఒక సెల్ఫ్-డ్రైవింగ్ కారు( Self-Driving Car ) ఒక బస్సును ఢీకొట్టింది.

 Startup Ceos Step In To Help After Self-driving Car Crashes In San Francisco Det-TeluguStop.com

ఈ కారు కృత్రిమ మేధ( AI ) ద్వారా నడిచే కారు.ఈ ప్రమాదం శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో జరగగా, అక్కడే ఒక ప్రముఖ టెక్ కంపెనీల సమావేశం నిర్వహించారు.

ఆ సమావేశానికి వచ్చిన వారు ఈ ప్రమాదాన్ని చూశారు.వారిలో చాలామంది ప్రముఖ టెక్ కంపెనీల అధిపతులు ఉన్నారు.

వీరంతా సమావేశం తర్వాత పార్టీకి వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది.

యాక్సిడెంట్( Accident ) జరిగినప్పుడు కొంతమంది ఈ దృశ్యాన్ని వీడియో తీశారు.ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఒక వ్యక్తి ఈ సంఘటన గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఆయన ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కారును కృత్రిమ మేధ నడిపే ఒక నిస్సహాయ రోబోగా అభివర్ణించారు.ఆటోమేటిక్ కారు బస్సును( Bus ) ఢీకొన్న తర్వాత అక్కడే నిలిచిపోయింది.

చాలామంది ఆ కారును అక్కడి నుండి తొలగించడానికి ప్రయత్నించారు.కానీ, ఆ కారు అసలు కదలలేదు.

కారు లైట్లు మెరుస్తున్నప్పటికీ, అది కదలకుండా అలాగే ఉండిపోయింది.ఈ దృశ్యాన్ని చూసి ఒక వ్యక్తి దీనిని “ఫౌండర్ మోడ్” అని పిలిచాడు.

అంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని స్వయంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించడం.

వేమో కంపెనీని గూగుల్( Google ) స్థాపించింది.ఈ కార్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి నడుస్తాయి.ఈ కార్లలో చాలా సెన్సార్లు ఉంటాయి.

ఈ సెన్సార్ల సహాయంతో కారు చుట్టూ ఉన్న వస్తువులను గుర్తిస్తుంది.ఆ కారు బ్యాటరీ సమస్య కారణంగా పనిచేయడం ఆగిపోయింది.

ఈ సంఘటన చూసి చాలామంది నవ్వుకున్నారు.ఎందుకంటే ఈ ప్రమాదం జరిగిన ప్రదేశంలో కొన్ని రోజుల క్రితం కృత్రిమ మేధ గురించి చాలా గొప్పగా చర్చించుకున్నారు ఇప్పుడు అదే ప్లేస్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఆధారపడటం ఎంత పెద్ద ప్రమాదం అర్థం అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube