ఆ మాజీ సీయం ఆ పదవి ఆశిస్తున్నారా ?  చంద్రబాబు ను కలిసింది అందుకేనా ? 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చట్టచివరి ముఖ్యమంత్రి గా , సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడిగా రాజకీయంగా ఒక వెలుగు వెలిగిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి( Nallari Kiran Kumar Reddy ) రాజకీయ జీవితం ఒడిదుడుకులుగానే ప్రస్తుతం ఉంది.ఎన్నికలకు ముందే బిజెపిలో( BJP ) చేరిన కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట నుంచి బిజెపి అభ్యర్థిగా వైసిపి అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పై పోటీ చేసి ఓటమి చెందారు.

 Former Cm Bjp Leader Kiran Kumar Reddy Meet Cm Chandrababu Naidu Details, Tdp, Y-TeluguStop.com

ఇక అప్పటి నుంచి తను ఉనికిని చాటుకునేందుకు కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం రాలేదు .ముఖ్యమంత్రిగా ఒక వెలుగు వెలిగి ఇప్పుడు రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవడం కిరణ్ కుమార్ రెడ్డికి అవమానంగానే ఉంది.ఏపీ వాసులకు హీరోగా కిరణ్ కుమార్ రెడ్డి అప్పట్లో  కనిపించారు.ఆ తర్వాత పార్టీలు మారినా ఆయనకు పెద్దగా కలిసి రాలేదు.సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నా,  దానిని ప్రజలు పట్టించుకోలేదు.

Telugu Ap, Chandrababu, Cm Chandrababu, Nallarikiran, Ysrcp-Politics

తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుతో( AP CM Chandrababu ) కిరణ్ కుమార్ రెడ్డి భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం గా మారింది.అసలు కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబును ఎందుకు కలిశారు ? వీరిద్దరి మధ్య జరిగిన చర్చ ఏమిటి ? గతంలో రాజకీయంగా బద్ధ శత్రువులుగా మెలిగిన చంద్రబాబు , కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఏ కారణంతో భేటీ అయ్యారు అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.అయితే కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబును కలవడం వెనుక కారణాలు ఉన్నాయట.

ఏపీ నుంచి త్వరలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి.  వాటిలో ఒకటి తనకు ఇవ్వాలని కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబును కోరినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ముఖ్యమంత్రిగా పదవి కాలం ముగిసిన దగ్గర నుంచి కిరణ్ కుమార్ రెడ్డికి ఏ పదవి దక్కలేదు.

Telugu Ap, Chandrababu, Cm Chandrababu, Nallarikiran, Ysrcp-Politics

దీంతో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండడంతో ,బిజెపి కోటాలో తనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తే పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Peddireddy Ramachandra Reddy ) కుటుంబానికి చెక్ పెడతానని చంద్రబాబుకు చెప్పారట.అయితే చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డి కి ఏ హామీ ఇచ్చారు అనేది తెలియనప్పటికీ , దీనిపై రకరకాల ఊహాగానాలు మీడియా సోషల్ మీడియాలో వస్తున్నాయి.దీంతోపాటు ఏపీ మంత్రి వర్గంలో మరో మంత్రి పదవి ఖాళీగా ఉండడంతో తన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలనే విషయాన్ని చంద్రబాబు వద్ద కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిపాదించినట్లు సమాచారం.

తనకు రాజ్యసభ సభ్యత్వం,  తన సోదరుడికి మంత్రి పదవి విషయం పైనే చర్చించేందుకు చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డిని కలిసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube