మీనా.( Meena ) బాలనటిగా తన సినిమా ప్రయాణం మొదలుపెట్టి హీరోయిన్ గా దాదాపు 10 ఏళ్లకు పైగా ఏక చక్రాధిపత్యం చేసి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే బుల్లితెరపై హోస్ట్ గా అనేక సినిమాల్లో నటిస్తున్నారు మీనా.
ఈ అందాల తార తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించింది.మరి మీనాను స్టార్ హీరోయిన్ గా ఎదిగేలా చేసిన ఆ టాప్ 10 సినిమాలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సీతారామయ్య గారి మనవరాలు

ఈ సినిమాకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది టైటిల్ రోల్ లో నటించిన మీనా కూడా ఆ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకునేలా చేయడంలో ఈ చిత్రం ఆమెకు బాగా సహాయపడింది.
చంటి

వెంకటేష్ మీనా హీరో హీరోయిన్స్ గా నటించిన చంటి సినిమా( Chanti Movie ) ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకే కాదు వెంకటేష్ కెరియర్ కి అలాగే మీనాకు కూడా ఒక మంచి బ్లాక్ బస్టర్ దొరికింది.ఈ సినిమా ఆమె కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు.
అల్లరి మొగుడు

1992 లో మోహన్ బాబు కి మీనా కు జోడీగా నటించిన అల్లరి మొగుడు సినిమా( Allari Mogudu ) మంచి విజయాన్ని దక్కించుకోవడం తో పాటు ఆమె కెరీర్ లో ఒక బెస్ట్ మూవీ గా నిలిచిపోయింది.
సుందరకాండ

దర్శకేంద్రుడుకి రాఘవేంద్ర దర్శకత్వంలో చంటి సినిమా తర్వాత వెంకటేష్ మరియు మీనా కాంబినేషన్లో వచ్చిన మరో సినిమా సుందరకాండ.( Sundarakanda ) ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో పాటు మీనా కి బెస్ట్ వచ్చేలా చేసింది.
ప్రెసిడెంట్ గారి పెళ్ళాం

ఒక సరైన హిట్టు కోసం ఎదురు చూస్తున్న సమయంలో నాగార్జున నటించిన ప్రెసిడెంట్ గారి పెళ్ళాం ఎంతో సక్సెస్ ను సాధించింది.ఈ సినిమా ద్వారా పల్లెటూరు పాత్రలో మీనా ఎంతో అద్భుతంగా కనిపించడంతోపాటు మంచి విజయాన్ని కూడా అందుకుంది.
అబ్బాయి గారు

సక్సెస్ ఫుల్ కాంబినేషన్ గా పేరు సంపాదించుకున్న వెంకటేష్ మరియు మీనా మరోసారి జోడి కట్టిన నటించిన సినిమా అబ్బాయి గారు. ఈ సినిమా అప్పట్లో ఎంత విజయాన్ని సాధించిందో మనందరికీ తెలుసు.
బొబ్బిలి సింహం

బాలకృష్ణకు జోడిగా మీనా నటించిన సినిమా బొబ్బిలి సింహం.( Bobbili Simham ) ఈ సినిమా ద్వారా ఆమె తన ఖాతాలో మంచి విజయాన్ని దక్కించుకుంది ఈ చిత్రానికి కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు.
సూర్య వంశం

వెంకటేష్ డ్యుయల్ రోల్ లో, మీనా హీరోయిన్ గా నటించిన సినిమా సూర్యవంశం.ఈ చిత్రం ద్వారా మీనాక్షి మరోసారి ఒక అద్భుతమైన విజయం దక్కింది.వెంకటేష్, మీనాకు ఇది వరుసగా నాలుగో హిట్ సినిమా కావడం విశేషం.
స్నేహం కోసం

కే ఎస్ రవి కుమార్ దర్శకత్వంలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయగా మీనా హీరోయిన్ గా నటించిన సినిమా స్నేహం కోసం.( Sneham Kosam ) స్నేహం గురించి తీసిన ఈ అద్భుతమైన సినిమా ద్వారా మీనాకు మరొక విజయం దక్కింది.
మా అన్నయ్య

రాజశేఖర్ డబల్ రోల్ లో నటించిన మా అన్నయ్య సినిమా కూడా మీనా కెరియర్లో ఒక చక్కటి సినిమాగా గుర్తింపు సంపాదించుకుంది.