కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు రానున్నారు.ఇందులో భాగంగా రేపు పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవాల్లో అమిత్ షా పాల్గొననున్నారు.
అదేవిధంగా రేపు తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలతో అమిత్ షా కీలక సమావేశం నిర్వహించనున్నారు.ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలపై పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది.
రాష్ట్ర రాజకీయాలతో పాటు పార్టీ అంతర్గత అంశాలపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.సోషల్ మీడియా పనితీరును వివరిస్తూ నేతలు ప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు ఈనెలలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న తెలంగాణ బీజేపీ బస్సు యాత్ర గురించి అమిత్ షాకు ఈ సమావేశంలో నేతలు వివరించనున్నారని సమాచారం.







