1.తిరుమల సమాచారం

తిరుమల( Tirumala )లో భక్తుల రద్దీ కొనసాగుతోంది.వరుసగా సెలవులు రావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పట్టనుంది.
2.ప్రశాంతంగా ఎస్సై ఏ ఎస్ ఐ పరీక్షలు
పోలీస్ శాఖలో ఎస్ఐ , ఏఎస్ఐ పోస్టులు భర్తీకి మొదటి పరీక్ష ప్రశాంతంగా ముగిసింది .ఆదివారం రెండో రోజు పరీక్షలు సజావుగా నే ప్రారంభమయ్యాయి.
3.టీటీడీ విజ్ఞప్తి
వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.దీంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా టిటిడి ఏర్పాట్లు చేస్తుంది.అధిక రద్దీ కారణంగా, రూ 300 దర్శనం టికెట్లు ఎస్ ఎస్ డి, దివ్యదర్శన టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమల కు రావాలని టీటీడీ ప్రకటించింది.
4.పోలవరం పూర్తిచేసేది చంద్రబాబే

పోలవరం ప్రాజెక్టు ను వైసిపి ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ఆ ప్రాజెక్టును పూర్తి చేసేది చంద్రబాబునాయుడు మాత్రమే అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) అన్నారు.
5.కొల్లాపూర్ ఎమ్మెల్యే పై జూపల్లి విమర్శలు
కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి పై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో విమర్శించారు. హర్షవర్ధన్ రెడ్డి అరాచకాలపై మొరపెట్టుకుంటున్నా, బి ఆర్ ఎస్ అధిష్టానం పట్టించుకోవడంలేదని జూపల్లి మండిపడ్డారు.
6.జగన్ పై చినరాజప్ప విమర్శలు

అధికార వైసిపి నేతలు జగనే మా భవిష్యత్తు అంటూ జనంలోకి వెళ్తున్నారని, అసలు ఎమ్మెల్యేలకు జగన్ పై నమ్మకం ఉందా అని మాజీ హోం మంత్రి టీడీపీ కీలక నేత నిమ్మకాయల చినరాజప్ప( Nimmakayala Chinarajappa ) విమర్శించారు.
7.భారత్ లో కరోనా

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 5357 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
8.నేడు బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేడు బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగుతుంది.ఇప్పటికే కర్ణాటక ముఖ్యనేతలతో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశం అయ్యారు.
9.హరీష్ రావు పర్యటన
నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు.నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
10.తిరుపతి నుంచి హైదరాబాద్ కు వందే భారత్ రైలు
నేడు తిరుపతి నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన వందే భారత్ రైలు మధ్యాహ్నం 03.30 గంటలకు ఈ ట్రైన్ బయలుదేరుతుంది.హైదరాబాదుకు 10:30 కు చేరుకుంటుంది.
11.అన్నవరం దేవస్థానంలో వివాహాల రిజిస్ట్రేషన్ నిలిపివేత
అన్నవరం దేవస్థానంలో వివాహాలు చేసుకునే వారికి వివాహ రిజిస్ట్రేషన్లు జారీ నిలిపివసినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు .దేవస్థానం సర్టిఫికెట్ కు చట్టబద్ధత లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
12.ముగియనున్న ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు
నేటితో ముగియనున్న ఒంటిమిట్ట కోదండ రాముడి బ్రహ్మోత్సవాలు.రాత్రికి పుష్ప యాగంతో ఉత్సవాలు పూర్తవుతాయి.
13.రాజధాని ఎక్స్ ప్రెస్ లో పొగలు

చెన్నై నుంచి ఢిల్లీ వెళ్తున్నా రాజధాని ఎక్స్ ప్రెస్( Rajdhani express ) కు ప్రమాదం తప్పింది.బి – 5 భోగి వద్ద పొగలు రావడంతో నెల్లూరు జిల్లా కావలి వద్ద నిలిపివేశారు.
14.ఏపీలో ఒమిక్రాన్ ఉప వేరియంట్
ఏపీలో ఒమి క్తాన్ ఉప వేరియంట్ అర్టూస్ కేసులు నమోదయ్యాయి.ఏపీలో మొత్తం ,114 యాక్టీవ్ కేసులు ఏపీ లో ఉన్నాయి.
15.జింక చర్మం స్వాధీనం
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలోని పోటు, గిడ్డంగి , అన్నదాన సత్రంలో పనిచేస్తున్న సిబ్బంది చేతివాటం ప్రదర్శించారనే సమాచారంతో , ఆలయ ఈవో వెంకటేష్ ఆధ్వర్యంలో సిబ్బంది ఇళ్లలో సోదాలు నిర్వహించారు .అనుబంధ ఆలయమైన వరదరాజస్వామి ఆలయ అర్చకులు కృష్ణమోహన్ నివాసంలో జింక చర్మం గుర్తించి అటవీ అధికారులకు సమాచారం అందించారు.
16.పొత్తులపై సోము వీర్రాజు కామెంట్

పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో మాకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.
17.కిషన్ రెడ్డి కామెంట్
రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన వ్యక్తిగా ముద్రపడిన కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ లో చేరడం పై తెలంగాణ బిజెపిపై ఎలాంటి ప్రభావం చూపదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
18. వందే భారత్ కు తిప్లరుపతి లో స్వాగతం
వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు తిరుపతి లో ఘన స్వాగతం లభించింది.
19.వాలంటీర్లకు వందనం

ఈ నెల 14 నుంచి వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని ఏపీ సీఎం జగన్ తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభించనున్నారు.
20.ఈ రోజు బంగారం ధరలు
