ముఖంపై అవాంఛిత రోమాలు ఉంటే చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతుంటారు.ఎంత తెల్లగా ఉన్నా.
అవాంఛిత రోమాలు ఉంటే నల్లగా, అందహీనంగా కనిపిస్తుంటారు.ముఖ్యంగా స్త్రీలు ముఖంపై అవాంచిత రోమాలు ఏర్పడితే.
తీవ్రంగా బాధ పడుతుంటారు.ఈ క్రమంలోనే వాటిని తొలిగించుకునేందుకు బ్యూటీ పార్లర్స్ చుట్టూ తిరుగుతారు.
అయితే ఇంట్లోనే న్యాచురల్‌గా కూడా ముఖంపై అవాంఛిత రోమాలను సులువుగా తొలిగించుకోవచ్చు.మరి అదెలాగో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో శెనగపిండి, చిటికెడు పసుపు మరియు పాలు కలిపి ముఖానికి పట్టించాలి.అరగంట పాటు బాగా ఆరనిచ్చి.ఆ తర్వాత మెల్ల మెల్లగా తడి చేతులతో స్క్రబ్ చేసుకోవాలి.అనంతరం వాటర్‌తో ముఖాన్ని వాష్ చేసుకోవాలి.
ఇలా వారినికి రెండు సార్లు చేస్తే.క్రమంగా అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.

రెండొవది.ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా కార్న్ ఫ్లోర్, ఎగ్ వైట్ మరియు తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.ఇరవై లేదా ముప్పై నిమిషాల పాటు వదిలేయాలి.ఆరిపోయిన తర్వాత మెల్లగా రుద్దుతూ.గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా ప్రతి రోజు చేస్తూ ఉంటే.అవాంఛీత రోమాలు పోతాయి.
మూడొవది.ఒక బౌల్‌లో వైట్ టూత్ పేస్ట్, చిటికెడు బేకింగ్ సోడా మరియు గోరు వెచ్చగా ఉండే నీరు పోసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖంపై ఎక్కడైతే ఎక్కువగా అవాంఛిత రోమాలు ఉన్నాయో.వాటిపై అప్లై చేయాలి.
పావు గంట లేదా ఇరవై నిమిషాలు పాటు వదిలేసి ఆ తర్వాత గోరు వెచ్చిని నీటితో శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి.ఇలా రెగ్యులర్‌గా చేస్తే.
ఖచ్చితంగా అవాంఛిత రోమాలు క్రమంగా రాలిపోతాయి.