టాలీవుడ్ నటి కేథరిన్.తన అందంతో గ్లామర్ బ్యూటీ గా పేరొందింది.
సినీ పరిశ్రమలో తన నటనకు మంచి గుర్తింపు దక్కింది.స్టార్ హీరోలతో నటించిన ఈ భామ.ప్రస్తుతం మరో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తో నటించనుంది.సినీ పరిశ్రమకు 2010లో పరిచయం కాగా మొదట కన్నడ, మలయాళం భాషలో నటించింది.
ఆ తరువాత తెలుగులో 2013 లో హీరో వరుణ్ సందేశ్ నటించిన ‘చమ్మక్ చల్లో’ సినిమాలో తొలిసారిగా పరిచయమైంది.
ఆ తర్వాత తమిళ భాషల్లో కూడా నటించగా దాదాపు 23 సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది ఈ గ్లామర్ బ్యూటీ.
అంతేకాకుండా నాచురల్ స్టార్ నాని తో పైసా సినిమాలో తన అందంతో అభిమానుల మనసు దోచుకుంది.అంతేకాకుండా స్టార్ హీరో అల్లు అర్జున్ తో మూడు సినిమాలలో నటించగా ‘ఇద్దరమ్మాయిలతో, సరైనోడు’ సినిమాతో మంచి హిట్ ను సాధించుకుంది.
అంతేకాకుండా ‘నేనే రాజు నేనే మంత్రి’ లో హీరో రానా తో నటించగా అందులో తన పాత్రను కాస్త గ్లామర్ తో చూపించింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం వేణు మల్లిడి దర్శకత్వంలో వస్తున్నా ‘తుగ్లక్’ సినిమాలో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ సరసన కేథరిన్ నటించనుంది.కాగా ఈ సినిమా ను రాజకీయాలననుసరించి తీస్తున్నారు.కేథరిన్ ఈ సినిమాకు ముందు క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ లో హీరో విజయ్ దేవరకొండ సరసన నటించగా ఆ సినిమాలో తన పాత్ర గుర్తింపు తెచ్చింది.
ఇదిలా ఉంటే కళ్యాణ్ రామ్ నటించిన ‘ఎంత మంచివాడవురా’ సినిమా అనుకున్నంత స్థాయిలో హిట్ కొట్టలేకపోయింది.కాగా ఈ సినిమా ఫ్లాప్ అయినందున.మరి ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ ఎలాంటి విజయాన్ని అందిస్తాడో అంటూ అభిమానులు ఎదురు చూస్తున్నారు.