1.చినజీయర్ స్వామి పై సీతక్క ఆగ్రహం
సమ్మక్క సారలమ్మలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన్న జీయర్ స్వామి పై ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.చినజీయర్ స్వామి అహంకార పూరితంగా మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు.
2.ఏపీ ప్రభుత్వం పై లోకేష్ ఆగ్రహం

ఏపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో సారా తయారవుతోందని లోకేష్ విమర్శలు చేశారు.
3.పవన్ చిత్రపటానికి పాలాభిషేకం
తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటానికి గ్రామస్తులు పాలాభిషేకం చేశారు.
4.బ్రదర్ అనిల్ కుమార్ కు క్రిస్టియన్ జెఎసి సూచన

బ్రదర్ అనిల్ కుమార్ ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టవద్దని క్రిస్టియన్ జేఏసి సూచించింది.ఈ మేరకు ఏపీ క్రిస్టియన్ జేఏసీ ఎలమంచిలి ప్రవీణ్ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా బ్రదర్ అనిల్ కుమార్ పైన అనేక ప్రశ్నలు సంధించారు.
5.పోలవరం ప్రాజెక్టుపై ఢిల్లీలో కీలక సమావేశం
పోలవరం ప్రాజెక్టు పై ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది.కేంద్ర జల శక్తి శాఖ మంత్రి శాఖ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.
6.టిడిపి ఎమ్మెల్సీ ల ఆందోళన

జంగారెడ్డిగూడెంలో సారాయి మరణాలపై శాసనమండలిలో టీడీపీ సభ్యులు ఆందోళన నిర్వహించారు.పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడం సభా కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో మండల్ చైర్మన్ మోషెన్ రాజు సభను వాయిదా వేశారు.
7.జగన్ కు సభాహక్కుల నోటీసు
జంగారెడ్డిగూడెంలో మరణాలను సీఎం జగన్ తప్పుదోవ పట్టిస్తున్నారని శాసనసభలోనూ మండలిలోనూ టిడిపి సభ్యులు జగన్ కు సభా హక్కుల నోటీసు ను ఇచ్చారు.
8.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.మంగళవారం తిరుమల శ్రీవారిని 61,982 మంది భక్తులు దర్శించుకున్నారు.
9.నేటి నుంచి రాష్ట్రస్థాయి రైతు సమ్మేళనం
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రస్థాయి రైతు సమ్మేళనం రైతు సమ్మేళనం తిరుపతి బైరాగి పట్టెడ లోని సీపీఐ కార్యాలయంలో నిర్వహిస్తున్నారు.
10.టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణలో మే 23 వ తేదీ నుంచి ఎస్ ఎస్ సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.ప్రతి పరీక్ష ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 45 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఎస్ఎస్సీ బోర్డు వెల్లడించింది.
11.శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు
శ్రీశైలంలో ఈనెల 30వ తేదీ నుంచి ఉగాది ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.ఏప్రిల్ 3వ తేదీతో ముగుస్తాయి.
12.కేసిఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ

తెలంగాణ సీఎం కేసీఆర్ కు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ రాశారు.రాష్ట్రంలో మిర్చి , పత్తి రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
13.కెసిఆర్ పై అసదుద్దీన్ ప్రశంసలు
తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశంసలు కురిపించారు.కెసిఆర్ ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు .
14.పవన్ కి విలన్ గా మిర్జాపూర్ నటుడు

పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కు విలన్ గా మీర్జాపూర్ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషించిన పంకజ్ త్రిపాటి విలన్ గా నటించనున్నారు.
15.కోదండరామ్ కామెంట్స్
తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని, ప్రశ్నించే నేతలను జైల్లో పెడుతున్నారని టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు.
16.పంజాబ్ పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా

పంజాబ్ పిసిసి అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు.
17.వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ
త్వరలోనే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలు భర్తీ చేయబోతున్నట్లు మంత్రి హరీష్ రావు ప్రకటించారు.
18.తెలంగాణలో ఇంటర్ పరీక్షలు

తెలంగాణలో మే 6 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయి.మే 23 తో ముగుస్తాయి.
19.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2, 876 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,300 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51, 600
.