ప్రస్తుత పోటీ ప్రపంచంలో మంచి ఉద్యోగం సాధించాలంటే ఎంత కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.టాప్ ర్యాంకులు సాధించిన వాళ్లు సులువుగా ఉద్యోగాలు సాధించే అవకాశాలు ఉంటాయి.
భీమవరం( Bhimavaram )లోని మావూళ్లమ్మ ఆలయాన్ని దర్శించుకుంటే చదువులో మంచి ర్యాంకులు వస్తాయని ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు.ఈ అమ్మవారు ఎంతో మహిమ గల అమ్మవారని పండితులు చెబుతున్నారు.
ఇక్కడి ప్రజలు అమ్మవారిని మహాకాళి ( Mahakali )అవతారంగా భావిస్తారు.9 దశాబ్దాల క్రితం ఇక్కడ అమ్మవారు వెలిశారని తెలుస్తోంది.ఈ తల్లి దీవెనల వల్ల ఇక్కడి ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారని సమాచారం అందుతోంది.ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సమయంలో ఈ ఆలయం దగ్గర ఉత్సవాలు జరుగుతాయి.
విజయవాడ( Vijayawada ) ప్రాంతానికి 103 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది.బస్సు మార్గం ద్వారా ఈ ఆలయాన్ని సందర్శించుకునే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది.
భీమవరం రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉందని సమాచారం అందుతోంది.ఏలూరు నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది.59 సంవత్సరాలుగా ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం గ్రాండ్ గా ఉత్సవాలు జరుగుతున్నాయి.
ఉత్సవాల చివరి రోజున సుమారు లక్ష మందికి అన్న ప్రసాదం వితరణ చేస్తారు.ఈ ఆలయాన్ని దర్శించుకుంటే బాగా చదవని పిల్లలు సైతం బాగా చదువుతారని తెలుస్తోంది.జీవితంలో ఒకసారైనా ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మంచిది.
ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.భీమవరంకు వెళ్లిన వాళ్లు ఈ ఆలయాన్ని కచ్చితంగా దర్శించుకోవడానికి ఆసక్తి చూపిస్తారు.
పండుగల సమయంలో వేల సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి హాజరవుతారు.ఈ ఆలయంలోని అమ్మవారిని ఏవైనా కోరికలు కోరుకుంటే ఆ కోరికలు కచ్చితంగా నెరవేరతాయట.
ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.