Difficulties : మంచి వారికే ఎందుకు కష్టాలు వస్తాయో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు చేసినా మంచి వాళ్లకు ఎప్పుడూ కష్టాలు వస్తూనే ఉంటాయి.

అసలు జీవితంలో ఒకసారి కూడా దేవాలయానికి వెళ్ళని వాడు, పెళ్ళికి బిక్షం పెట్టని వాడు కూడా సుఖంగా జీవిస్తూ ఉంటాడు.

అయితే ఎందుకిలా జరుగుతుందని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు.చర్యకి ప్రతి చర్య అనేది తప్పకుండా ఉంటుంది.

మనం చేసే ప్రతి పనిని పంచభూతాలైన గాలి, నేల, నీరు, నిప్పు, ఆకాశం నిరంతరం గమనిస్తూ ఉంటాయి.దీనినే కర్మఫలం అని అంటారు.

ఈ భూమి మీద పుట్టిన ప్రతి పని, ప్రాణి తను గత జన్మలో చేసిన పాపం, పుణ్యాల యొక్క కర్మ ఫలాన్ని మరో జన్మలో కచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది.

Advertisement

జాగ్రత్తగా గమనిస్తే కొంతమంది ధనవంతులు ఇంట్లో పిల్లలు బుద్ధిహీనంతో, అంగవైకల్యంతో( mentally retarded , crippled ) ఉంటారు.ఇంట్లో సకల సౌకర్యాలు ఉన్న కూడా ఏదో వారు అనుభవించలేరు.అది కర్మఫలం( karma ).అంటే ఘోర పాపాలు చేసి ఉంటే, అంటే ధనాన్ని దొంగలించడం, వేరొకరికి అంగవైకల్యం కలిగించిన వంటి పాపాలను చేస్తే వారు ఈ జన్మలో ఇలాంటి పుట్టుకలో పుట్టవలసి ఉంటుంది.మరి వారి తల్లిదండ్రులు ఏం చేశారు? గత జన్మలో వారి పిల్లలు చేసిన పాపాలకు వీరు ఎందుకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది, అంటే పెద్దలు సంపాదించిన ఆస్తి పాస్తులు మనకు వారసత్వం ద్వారా ఎలా అయితే సంక్రమిస్తాయో.అదేవిధంగా వారు చేస్తున్న పాప, పుణ్యాలు కూడా వారి తరాల వారికి తప్పకుండా బదిలీ అవుతూ ఉంటాయి.

వారి ఉసురు అనేది వారి తరతరాల వారికి ఏదో విధంగా చెడు చేస్తూనే ఉంటుంది.అలాంటి వారి ఇంట్లోనే ఇలా గత జన్మలో ఘోర పాపాలను చేసిన వారు ఈ జన్మలో కర్మ ఫలాన్ని అనుభవించడానికి పుడుతూ ఉంటారు.ఇక మంచి వారికి ఎప్పుడూ వరుసగా కష్టాలు వస్తున్నాయి అనే విషయానికి వస్తే వారు ఈ జన్మలో ఎలాంటి దోషాలు చేయకపోయినా గత జన్మలో చేసిన పాపాలకు ఈ జన్మలో ఫలితం తప్పకుండా అనుభవించాల్సి ఉంటుంది.

ఇక బంగారాన్ని ఎంతో వేడిలో మరిగిస్తే కానీ అందమైన ఆభరణంగా మారదు.అలాగే వరుసగా కష్టాలు అనేవి ఎప్పటికీ ఉండవు.చెడు వెనుకే మంచి, కష్టాల వెనుకే సుఖం అనేది తప్పకుండా ఉంటుంది.

Bald Head in Men : మగవారికి బట్టతల రావడానికి ముఖ్యమైన కారణాలు ఇవే..!
Advertisement

తాజా వార్తలు