హిందూ ధర్మంలో అత్యంత ప్రాచుర్యం పొందిన దేవుళ్లలో శ్రీకృష్ణుడు( Lord krishna ) ముఖ్యమైన దేవుడని దాదాపు చాలా మందికి తెలుసు.శ్రీకృష్ణుడి నేతృత్వంలో జరిగిన మహాభారత యుద్ధంలో 100 మంది కౌరవ సోదరులు మరణించారు.
ఆ తర్వాత ఏం జరిగిందో శ్రీకృష్ణుడి, అర్జునుడి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే మహాభారత యుద్ధము తర్వాత శ్రీకృష్ణుడు హస్తినాపుర రాజభవనానికి తిరిగి వస్తాడు.
శ్రీకృష్ణుడిని చూడగానే గాంధారి కోపం, దుఃఖంతో అగ్నిపర్వతంలా మారుతుంది.తర్వాత 100 మంది కుమారులైన కౌరవులను రక్షించడానికి ఏమీ చేయలేదని ఆమె శ్రీకృష్ణునిపై కోపంతో ఉంటుంది.
అలాగే కొడుకులను కోల్పోయిన బాధతో గాంధారి శ్రీకృష్ణుడిని శపిస్తుంది.యుద్ధంలో కౌరవులు మరణించినందున యాదవ వంశం నాశనం అయిపోతుందని శపిస్తుంది.గాంధారి శాపం కారణంగా శ్రీకృష్ణుడు మరణిస్తాడు.యాదవ వంశం మొత్తం నశిస్తుంది.గాంధారి తన రెండవ శాపంగా ద్వారకా నాశనం కావాలని శపిస్తుంది.ఫలితంగా శ్రీకృష్ణుడి ద్వారకానగరం మహాసముద్రంలో మునిగిపోతుంది.
అలాగే మృత్యువు తనను వేగంగా అధిగమించడానికి ప్రయత్నిస్తుందని గ్రహించిన శ్రీకృష్ణుడు దట్టమైన అడవికి వెళ్లి అక్కడ తపస్సు చేయాలని నిర్ణయించుకుంటాడు.శ్రీకృష్ణుడు తపోవనంలో తపస్సులో ఉంటాడు.
ద్వారకలో( Dwarka ) శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు ప్రాణం వదిలాడు.అంతక్రియలు వెనువెంటనే జరిపించాల్సి వచ్చింది.
కానీ అందుబాటులో బలరాముడు కూడా లేడు.
సమస్త బంధుగణం మధ్య ఘనంగా ఆ కార్యక్రమం అర్జునుడే జరిపించాడు.ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడికి ఈ వార్త చెప్పాలని వెతుక్కుంటూ ఒక్కడే తపోవనానికి వచ్చాడు.అర్జునుడు రెండు రోజులు తిరిగిన తర్వాత మొత్తానికి ఒక చోట శ్రీకృష్ణుడు ప్రాణం లేకుండా కనిపించాడు.
అప్పుడు అర్జునుడు హతాశయుడైపోయాడు.అది శ్రీకృష్ణ కళేబరం కాదని కూడా నమ్మాలనుకున్నాడు.
అప్పటికే శ్రీ కృష్ణుడు ఆ అరణ్యంలో బోయవానీ బాణం కాలికి తగలడం వల్ల తన దేహాన్ని విడిచి నాలుగు రోజులు గడిచాయి.శ్రీకృష్ణుని మృతదేహాన్ని ద్వారకకి తీసుకెళ్లే వీలు లేక అక్కడే అర్జునుడు ఒక్కడే ఎలాంటి అర్భాటమూ లేకుండా అంత్యక్రియలు పూర్తి చేశాడు.
అష్టభార్యలు, 80 మంది సంతానం, మనుమలు, విపరీతమైన బలగం, అఖండమైన కీర్తి ఉన్న శ్రీకృష్ణుడికి అంత్యక్రియలు సమయానికి బావైన అర్జునుడు తప్ప ఇంకెవరూ లేరు.
LATEST NEWS - TELUGU