సాధారణంగా కొంత మంది జాతకంలో కుజ దోషం ఉంటే వివాహ జీవితంలో ఎన్నో రకాల అడ్డంకులు కచ్చితంగా వస్తూ ఉంటాయని పండితులు చెబుతున్నారు.అంతే కాకుండా వారి వివాహం కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతాయని వెల్లడించారు.
జాతకంలో రెండో ఇంట్లో కుజుడు ఉంటే కుజదోషం ఉంటుందని చాలా మంది చెబుతూ ఉంటారు.అయితే కుజదోషం వల్ల కలిగే ఇబ్బందులకు పండితులు కొన్ని పరిష్కారాలను చెబుతున్నారు.
ఆ పరిష్కారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కుజుడు అంటేనే ధైర్యం సాహసానికి ప్రతిక అని చెబుతూ ఉంటారు.
అయితే ఈ గ్రహ దోషం ఏర్పడితే ముఖ్యంగా ఆ ప్రభావం దాంపత్య, ఆర్థిక పురోగతి పై ప్రభావం చూపుతుంది.దాన్నే కుజదోషమని కూడా అంటారు.పూజ లగ్నం నుంచి ద్వితీయ స్థానం కుటుంబ స్థానం కాబట్టి కుజదోషం ఉంటే కుటుంబం పై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.కుజగ్రహం రెండో ఇల్లు నిద్రకు సంబంధించింది.
కాబట్టి నిద్ర నాణ్యత పై కూడా ప్రభావం చూపుతుంది.
దీనివల్ల మరిన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి.ముఖ్యంగా ఈ కుజదోషంతో బాధపడేవారు కొన్ని పరిష్కారాలు చేసుకుంటే త్వరగా ఉపశమనం కలుగుతుంది.మీ జాతకంలో కుజుడు కనిపిస్తే మంగళవారం రోజు నవగ్రహ మంత్రాలు తప్పకుండా పాటించాలి.
అంతే కాకుండా ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటే మంచిది.అదే విధంగా కుజదోషం ఉన్నవారు గాయత్రి మంత్రం లేదా హనుమాన్ చాలీసా పండించడం వల్ల దోషం ప్రభావం తగ్గుతుంది.
మంగళవారం కత్తులు, ఎర్ర పుష్పాలు, గోధుమ రొట్టెలు, ఎరుగుపట్టు, ఎరుపు పగడాలను అవసరమైన వారికి దానం చేయడం వల్ల దోషం నుంచి వ్యక్తి పొందవచ్చు.
DEVOTIONAL