ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల పుణ్య క్షేత్రానికి ప్రతి రోజు ఎంతో మంది భక్తులు తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు.మరి కొంత మంది భక్తులు స్వామి వారికి పూజలు, అభిషేకాలు జరిపిస్తూ ఉంటారు.
కాలి నడకన తిరుమలకు వచ్చే భక్తుల కోసం తిరుమల దేవస్థానం( Tirumala Devasthanam ) కీలక నిర్ణయం తీసుకుంది.కాలి నడకన తిరుమలకు వచ్చే భక్తులకు టైంస్లాట్ టోకెన్లు( Timeslot tokens ) జారీ చేసే విధానం పై తిరుమల తిరుపతి దేవస్థానం కసరత్తులు చేస్తుంది.
ప్రస్తుతం టోకెన్ రహిత దర్శనాలకు భక్తుల రాక అధికమవుతున్న క్రమంలో నిరీక్షణ సమయం భారీగా పెరిగిపోతోంది.ఇందులో భాగంగానే ఎలాంటి టోకెన్ లేకుండా వచ్చే భక్తుల ఇబ్బందులను తగ్గించడం పై తిరుమల తిరుపతి దేవస్థానం( TTD ) దృష్టి సారించింది.టోకెన్లు, టికెట్లు లేకుండా కానీ నడకన వచ్చే భక్తుల సంఖ్య ఎంత శాతం ఉందనే అంశం పై నెల రోజుల నుంచి సర్వే చేసి 40 నుంచి 50% టికెట్లు, టోకెన్లు ఉన్న వారు వస్తున్నట్లు తిరుమల తిరుపతి స్థానం అధికారులు గుర్తించారు.
ఎలాంటి దర్శన టికెట్లు లేని వారి అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో టైంస్లాట్ సర్వ దర్శనం టోకెన్లు జారీ చేస్తే నిర్దేశించిన సమయానికే తిరుమలకు భక్తులు వస్తారని తద్వారా వారికి స్వామివారి దర్శనానికి ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం ఉండదని తిరుమల తిరుపతి దేవస్థానం భావిస్తుంది.అయితే టికెట్లు ఉన్నవారు కూడా మరో దర్శనం కోసం ఈ టోకెన్లు పొందే ప్రయత్నం చేసే అవకాశం ఉన్న క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తూ ఉంది.ఎలాంటి టికెట్లు లేని వారికే నడక మార్గంలో టైంస్లాట్ టోకెన్లు జారీ చేసేలా తిరుమల తిరుపతి దేవస్థానం అమలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది.
ఈ విధానం అమలులోకి వస్తే స్వామివారి దర్శనానికి ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.