వేసవిలో కచ్చితంగా సపోటాను తినాలి.. ఎందుకో తెలుసా?

పిల్ల‌లు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినే పండ్లలో సపోటా ఒకటి.అందుకు కారణం వాటి రుచి.

 Why Eat Sapota In Summer Details, Sapota, Sapota Benefits, Latest News, Health,-TeluguStop.com

మధురమైన రుచిని కలిగి ఉండే సపోటా పండ్లను ఈ ప్రకృతి మనకు ఇచ్చిన వరంగా చెప్పుకోవచ్చు.సపోటా పండ్లు( Sapota ) రుచిగా ఉండడమే కాదు ఎన్నో అమోఘమైన పోషక విలువలు కూడా కలిగి ఉంటుంది.

అందుకే ఆరోగ్యపరంగా సపోటా అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.ముఖ్యంగా ప్రస్తుత స‌మ్మ‌ర్ సీజ‌న్ లో ఖచ్చితంగా సపోటా పండ్లను తినాలని చెబుతుంటారు.

అందుకు కారణం లేకపోలేదు.

వేసవిలో ఎండల దెబ్బకు ప్రతి ఒక్కరూ నీరసం, అలసట వంటి సమస్యలతో తరచూ ఇబ్బంది పడుతుంటారు.

అయితే వీటికి చెక్ పెట్టడంలో సపోటా పండ్లు అద్భుతంగా సహాయపడతాయి.రోజుకు రెండు సపోటా పండ్లను తీసుకుంటే నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉంటాయి.

అలాగే సపోటా పండ్ల‌లో పోషకాలతో పాటు నీటి శాతం కూడా అధికంగా ఉంటుంది.అందువల్ల సపోటా పండ్లను సమ్మర్ లో తీసుకుంటే డీహైడ్రేషన్ కు ( Dehydration ) గురి కాకుండా ఉంటారు.

వడదెబ్బ కొట్టకుండా కూడా ఉంటుంది.

సపోటా పండ్ల ద్వారా మన శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు ఇలా ఎన్నో పోషకాలను పొందొచ్చు.సపోటా పండ్లను డైట్ లో చేర్చుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.కంటి చూపు మెరుగుపడుతుంది.

మలబద్ధకం సమస్య ఉంటే దూరం అవుతుంది.

క్యాన్సర్ వచ్చే రిస్క్‌ తగ్గుతుంది.మరియు ఇమ్యూనిటీ సిస్టం( Immunity system ) కూడా బూస్ట్ అవుతుంది.అయితే మధుమేహం వ్యాధిగ్రస్తులు మాత్రం సపోటా పండ్లను ఎవైడ్ చేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఎందుకంటే మధుమేహం ఉన్నవారు సపోటా పండ్లను తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ భారీ గా పెరుగుతాయి.దీంతో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube