ముఖ్యంగా చెప్పాలంటే హిందూ సంప్రదాయం( Hindu tradition ) ప్రకారం మనం ఎల్లప్పుడూ కొన్ని ఆచారాలు, పద్ధతులను పాటిస్తూ ఉండాలి.ముఖ్యంగా జీవితంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలకు గ్రహాలు, రాశులు, అనుకూల క్షణాలు తప్పకుండా చూస్తూ ఉంటారు.
దాదాపు 3 నెలల వరకు శుభ సమయాలు లేవని జ్యోతిష్య నిపుణులు( Astrologers ) చెబుతున్నారు.అయితే మూఢంలో కూడా కొన్ని పనులు చేయవచ్చని పండితులు చెబుతున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే చిన్నపిల్లలకు మొదటిసారి అన్నం తినిపించడానికి అన్నప్రాసన్న నిర్వహిస్తారు.ఈ వేడుకను దేవస్థానంలో కానీ, తమ ఇంటి వద్ద గాని అన్నప్రాసన్న కార్యక్రమాన్ని ( Annaprasanna program ) నిర్వహిస్తారు.కొందరు బంగారు గిన్నెలో, మరి కొందరు వెండి పళ్ళెన్నీ సేకరించి పరమాన్నం లేదా పాయసం తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత పిల్లలకు అన్నప్రాసన్న చేయిస్తారు.ఈ వేడుకను మూఢంలో కూడా చేసుకోవచ్చు.
ఇంకా చెప్పాలంటే కొన్ని సార్లు భూమి అకస్మాత్తుగా సరసమైన ధరకు అందుబాటులోకి వస్తుంది.
ఈ సమయంలో భూమిని కొనవచ్చుని పండితులు చెబుతున్నారు.ఈ సమయంలో ఇప్పుడు మూఢం ఉంది కదా అని ఆలోచించాల్సిన అవసరం లేదు.ఈ సమయంలో భూమిని కొనుగోలు చేసుకోవచ్చు.
ఇది చెడు ప్రభావాన్ని చూపదు.భూమిని అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తే అమ్ముకోవచ్చు.
అలాగే కొత్త ద్విచక్ర వాహనం లేదా నాలుగు చక్రాల వాహనాలను కొనుగోలు చేసేవారు మూఢలు ఉన్నాయని వేచి చూడాల్సిన అవసరం లేదు.మూఢలు ఉన్నా కూడా కొత్త కార్లు కొంటే కొనవచ్చు.
అలాగే కొందరికి ఉన్నత చదువులు, ఉద్యోగల కోసం విదేశీలకు వెళ్లే అవకాశం వస్తుంది.అలాంటివారు మూడాలు ఉన్నాయని ఆగల్సిన అవసరం లేదు.
మీరు సంతోషంగా విదేశీ ప్రయాణం చేయవచ్చు.