శనివారం నల్ల నువ్వుల తో పాటు.. ఈ వస్తువులను దానం చేస్తే ఆర్థిక సమస్యలతో పాటు..?

సనాతన ధర్మంలో శనీశ్వరుడిని( Saturn ) కర్మ ఫలాలను ఇచ్చే దేవుడిగా ప్రజలు పరిగణిస్తారు.ఒక వ్యక్తి తన పనులను ఎలా చేస్తాడనే దాన్ని ఆధారంగా ఫలితాలను పొందుతాడు.

 Along With Black Sesame On Saturday If These Items Are Donated, Along With Finan-TeluguStop.com

శనీశ్వరుడిని ఆరాధించడానికి శనివారం ఉత్తమమైన రోజుగా పరిగణిస్తారు.శని దేవుని ఆశీర్వాదం పొందడానికి శనివారం రోజు కొన్ని వస్తువులను దానం చేయవచ్చు.

ఎందుకంటే ఈ దానాలు చేయడం వల్ల శనీశ్వరుడి ప్రసన్నం లభిస్తుంది.ఫలితంగా ఆయన తన భక్తులను రక్షిస్తాడు.

శనివారం దానం చేయవలసిన వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Astrology, Iron Vessels, Vastu, Vastu Tips-Latest News - Telugu

జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం శనివారం రోజు ఆవనూనెను దానం చేయడం లేదా ఆవనూనెను ఉపయోగించడం చాలా ప్రయోజనకరం అని ప్రజలు భావిస్తారు.శని కారణంగా మీ జీవితంలో ఆటంకాలు ఎదురు అయినట్లయితే శనివారం రోజు ఎక్కువగా ఆవనూనెను( Mustard oil ) ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.అలాగే శనివారం రోజు ఒక ఇనుప పాత్రలో ఆవనూనెను తీసుకొని అందులో ఒక రూపాయి నాణెం వేసి ఆ నూనెలో మీ ముఖం చూసుకొని తర్వాత పేదవారికి దానం చేయాలి.

ముఖ్యంగా చెప్పాలంటే చాలా రోజుల నుంచి మిమ్మల్ని కొన్ని రకాల వ్యాధులు బాధిస్తూ ఉంటే శనివారం సాయంత్రం ఒక పేద వ్యక్తికి నల్లని వస్త్రాలు, చెప్పులు దానం చేసి ఆ వ్యక్తి నుంచి ఆశీర్వాదం పొందాలి.

Telugu Astrology, Iron Vessels, Vastu, Vastu Tips-Latest News - Telugu

ఇలా చేయడం వల్ల క్రమంగా మీ ఆరోగ్యం మెరుగు పడుతుంది.అలాగే శనివారం రోజు ఇనుప పాత్రలను( Iron vessels ) దానం చేయడం శుభమని నిపుణులు చెబుతున్నారు.మీ జాతకంలో శని ప్రమాదకరంగా ఉంటే అట్ల పెనం, పటకారు వంటి ఇనుప పాత్రలను పేదవారికి దానం చేయాలి.అలాగే మీరు డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కొన్నట్లయితే శనివారం సాయంత్రం పూట ఒక1.25 కిలోల నల్ల మినప్పప్పు లేదా నల్ల నువ్వులను దానం చేయాలి.ఇలా వరుసగా ఐదు శనివారాల పాటు చేయడం వల్ల ఈ సమస్యలన్నీ దూరమవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube