ఖరీదైన కారు కొన్న సావిత్రక్క.. ఫోటో వైరల్..!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ శివజ్యోతి (తీన్మార్ సావిత్రి) కొత్త కారు కొన్నారు.బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి ముందు ప్రముఖ ఛానెల్ లో తీన్మార్ వార్తలు అనే కార్యక్రమంలో యాంకర్ గా పని చేసి శివజ్యోతి పాపులారిటీ సంపాదించుకున్నారు.

 Bigg Boss Season 3 Contestant Shivajyothy Buys A New Car, Savitrakka, Anchor Siv-TeluguStop.com

ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొనడం ద్వారా ఆమె వార్తల్లో నిలిచారు.తెలంగాణ యాసలో తడబడకుండా మాట్లాడటం శివజ్యోతి ప్రత్యేకత.

ప్రస్తుతం ఒక ప్రముఖ ఛానెల్ లో ఇస్మార్ట్ న్యూస్ అనే కార్యక్రమానికి శివజ్యోతి యాంకర్ గా పని చేస్తున్నారు.శివజ్యోతి యాంకర్ గా చేస్తున్న ఈ షోకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన డబ్బులతో గతేడాది కొత్త ఇల్లు కొన్న శివజ్యోతి ప్రస్తుతం కొత్త కారును కొన్నారు.శివజ్యోతి భర్త గంగూలీతో కలిసి ఫోటోలు దిగగా నెట్టింట ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

శివజ్యోతి కారు కొన్నందుకు ఆమె అభిమానులతో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సైతం కంగ్రాట్స్ చెబుతున్నారు.

Telugu Biggboss, Buys Car, Ganguly, Ravikrrishna, Shivajyothy-Latest News - Telu

బిగ్ బాస్ హౌస్ లో ప్రతి చిన్న విషయానికి ఏడుస్తూ పాతాళగంగ అనే పేరు తెచ్చుకున్న శివజ్యోతి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్లతో అప్పుడప్పుడూ కలుస్తూ ఆ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.శివజ్యోతి బిగ్ బాస్ కంటెస్టెంట్లు హిమజ, రోహిణిలను తరచూ కలవడంతో పాటు రవికృష్ణతో కలిసి యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు.

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో ఆ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లకు పాపులారిటీతో పాటు భారీగా అవకాశాలను తెచ్చిపెడుతోంది.

బిగ్ బాస్ సీజన్ 1, బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్లకు హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా పెద్దగా ఆఫర్లు రాకపోయినా బిగ్ బాస్ సీజన్ 3, బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్లు మాత్రం హౌస్ నుంచి బయటకు వచ్చాక వరుస అవకాశాలతో బిజీ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube