ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకోలేకపోయిన వైసీపీ పై( YCP ) నా, ఆ పార్టీ అధినేత జగన్ పైనా( Jagan ) అనేక విమర్శలు ఇంటా బయటా వస్తూనే ఉన్నాయి.జగన్ ను టార్గెట్ చేసుకుని ఏపీలోని రాజకీయ ప్రత్యర్ధులే కాదు, తెలంగాణలో ని నాయకులూ తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.
తాజాగా జగన్ ను టార్గెట్ చేసుకుంటూ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్( Raja Singh ) సంచలన వ్యాఖ్యలు చేశారు.ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి సీఎం చంద్రబాబుకు రాజాసింగ్ శుభాకాంక్షలు తెలిపారు .ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి కామెంట్ చేశారు.గతంలో కన్వర్టెడ్ క్రిస్టియన్ జగన్ అధికారంలోకి రాగానే హిందూ ధర్మానికి తీవ్ర నష్టం చేశారని రాజసింగ్ ఆరోపించారు.
ప్రాచీన దేవాలయాలను దెబ్బతీశారని, తిరుమలలో అన్యమతస్తులకు ఉద్యోగాలు ఇవ్వడం, కన్వర్టెడ్ క్రిస్టియన్ ను టీటీడీ చైర్మన్ ను చేయడం పైనా రాజాసింగ్ మండపడ్డారు.జగన్ హయాంలో తిరుమల( Tirumala ) పవిత్రతను దెబ్బతీశారని , మాంసం , మందు కూడా కొండపైకి తరలించారని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.వీటన్నిటిని పరిశీలించిన తరువాతే ఏపీ ప్రజలు జగన్ పాలనాలో ఆంధ్ర సురక్షితంగా ఉండదని భావించే , ఆయనను ఆ పార్టీని ఓడించారని, సీఎం గా బాధ్యతలు చేపట్టగానే చంద్రబాబు( Chandrababu ) తిరుమల లో అధర్మమైన పనులు చేస్తే సహించేది లేదని రాజసింగ్ అన్నారు.
తిరుమలలో ఎలా అయితే ధర్మ పరిరక్షణ చేస్తామని చెప్పారో , అలాగే శ్రీశైలంలో ( Srisailam ) కూడా హిందూ ధర్మ వ్యతిరేకులు రాజ్యమేలుతున్నారని, ఏపీలో ఉన్న ప్రాచీన దేవాలయాల్లో హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేలా చూడాలని కోరారు .హిందువులకు మాత్రమే ఆలయాల్లో ఉద్యోగాలు , చైర్మన్ , బోర్డు మెంబర్లు ఇవ్వాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు.ప్రస్తుతం రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వైరల్ గా మారాయి.