కల్కి వారి క్రేజ్ దృష్టిలో పెట్టుకొని చేశాను... ఆ విషయం సిల్లీగా అనిపించింది: నాగ్ అశ్విన్

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) త్వరలోనే కల్కి( Kalki ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా జూన్ 27వ తేదీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

 Nag Ashwin Interesting Comments About Kalki Movie Details, Nag Ashwin,kalki,prab-TeluguStop.com

అత్యంత భారీ బడ్జెట్ సినిమాకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు కూడా భాగమైన సంగతి మనకు తెలిసిందే.ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను కూడా పెంచేసాయి.

Telugu Nag Ashwin, Kalki, Kamal Haasan, Prabhas, Prabhas Kalki-Movie

ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్( Nag Ashwin ) సైతం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈయన కల్కి సినిమా గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ సినిమాలో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు బాగమయ్యారు.వారందరినీ హ్యాండిల్ చేయడం అంటే మామూలు విషయం కాదని తెలిపారు.నేను ఇండస్ట్రీలోకి వచ్చి చాలా తక్కువ రోజులు అయింది కానీ అమితాబ్( Amitabh ) , కమల్ హాసన్( Kamal Hassan ) వంటి వారందరూ నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారని తెలిపారు.

Telugu Nag Ashwin, Kalki, Kamal Haasan, Prabhas, Prabhas Kalki-Movie

ఇలా ఇంత అనుభవం ఉన్నటువంటి వారికి నేను సినిమా కథను వివరిస్తూ ఉంటే నాకు చాలా సిల్లీగా అనిపించిందని తెలిపారు.ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో ప్రభాస్ దీపిక పదుకొనే( Deepika Padukone ) నటించారు.అయితే ప్రేక్షకులలో వారికి ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని వారి పాత్రలను డిజైన్ చేశానని తెలిపారు.

అభిమానులు వీరి నుంచి ఏం ఆశిస్తున్నారో అలాంటి అంశాలన్నీ కూడా సినిమాలో ఉండబోతున్నాయని తెలిపారు.ఇక ఈ సినిమా చిన్న పిల్లలు కూడా చూస్తూ ఎంతో ఆస్వాదిస్తారని ఈయన ఈ సినిమా గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube