కల్కి వారి క్రేజ్ దృష్టిలో పెట్టుకొని చేశాను… ఆ విషయం సిల్లీగా అనిపించింది: నాగ్ అశ్విన్

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) త్వరలోనే కల్కి( Kalki ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా జూన్ 27వ తేదీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

అత్యంత భారీ బడ్జెట్ సినిమాకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు కూడా భాగమైన సంగతి మనకు తెలిసిందే.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను కూడా పెంచేసాయి.

"""/" / ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్( Nag Ashwin ) సైతం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈయన కల్కి సినిమా గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమాలో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు బాగమయ్యారు.వారందరినీ హ్యాండిల్ చేయడం అంటే మామూలు విషయం కాదని తెలిపారు.

నేను ఇండస్ట్రీలోకి వచ్చి చాలా తక్కువ రోజులు అయింది కానీ అమితాబ్( Amitabh ) , కమల్ హాసన్( Kamal Hassan ) వంటి వారందరూ నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారని తెలిపారు.

"""/" / ఇలా ఇంత అనుభవం ఉన్నటువంటి వారికి నేను సినిమా కథను వివరిస్తూ ఉంటే నాకు చాలా సిల్లీగా అనిపించిందని తెలిపారు.

ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో ప్రభాస్ దీపిక పదుకొనే( Deepika Padukone ) నటించారు.

అయితే ప్రేక్షకులలో వారికి ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని వారి పాత్రలను డిజైన్ చేశానని తెలిపారు.

అభిమానులు వీరి నుంచి ఏం ఆశిస్తున్నారో అలాంటి అంశాలన్నీ కూడా సినిమాలో ఉండబోతున్నాయని తెలిపారు.

ఇక ఈ సినిమా చిన్న పిల్లలు కూడా చూస్తూ ఎంతో ఆస్వాదిస్తారని ఈయన ఈ సినిమా గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

భార్య అంటే ఎంతప్రేమో.. భార్య బికినీ వేసుకుని తిరిగేందుకు ఏకంగా “దీవి”నే కొనేసిన భర్త..