ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయిన టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా అవకాశాలను అందుకొని స్టార్ హీరోగా సక్సెస్ అయ్యారు నటుడు విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ).కెరియర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలలో నటించిన ఈయన పెళ్లి చూపులు సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.అనంతరం ఈయన నటించిన అర్జున్ రెడ్డి సెన్సేషనల్ హిట్ అందుకుంది.
ఈ సినిమాతో ఈయన పేరు ఇండస్ట్రీలో మారు మోగిపోయింది ఈ సినిమా తర్వాత విజయ్ నటించిన గీత గోవిందం( Geetha Govindam ) కూడా మరో బ్లాక్ బస్టర్ కావడం విశేషం.

ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రావడంతో ఈయన క్రేజ్ భారీగా పెరిగిపోయింది.ఇక ఈ సినిమా తర్వాత రష్మిక( Rashmika )తో కలిసి ఈయన డియర్ కామ్రేడ్( Dear Comrade ) సినిమాలో నటించారు.ఈ సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో మాత్రం సక్సెస్ అందుకోలేకపోయింది.
ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేకపోయినప్పటికీ ఓటీటీ అలాగే యూట్యూబ్ ఛానల్ లో మాత్రం అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది.

ముఖ్యంగా హిందీ డబ్బింగ్ యూట్యూబ్ ఛానల్ లో మాత్రం ఈ సినిమా భారీ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంది.అయితే తాజాగా ఈ సినిమాకు ఏకంగా 400 మిలియన్ వ్యూస్ రావడంతో విజయ్ దేవరకొండ ఈ సినిమాపై స్పందిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.డియర్ కామ్రేడ్ రిలీజ్ అయిన రోజున పడిన బాధ నుంచి ఇప్పటి వరకు మాకు అనంతమైన ప్రేమ దొరికింది.
డియర్ కామ్రేడ్ నాకు ఎంతో నచ్చిన సినిమా.ఎంతో ఇష్టమైన కథ. అని విజయ్ ఎమోషనల్ అయ్యారు.ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే ఈయన చివరిగా ఫ్యామిలీ స్టార్( Family Star ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా పై ఎన్నో అంచనాలు ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.
ప్రస్తుతం ఈయన గౌతమ్ తిన్ననూరి సినిమా పనులలో బిజీగా ఉన్నారు.