ఆ తేదీన గేమ్ ఛేంజర్ రిలీజ్ కావాలంటున్న ఫ్యాన్స్.. చరణ్ వాళ్ల కోరికను తీరుస్తారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా( Devara ) రెండు వారాలు ప్రీపోన్ కావడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.ఓజీ సినిమా( OG ) వాయిదా పడిన నేపథ్యంలో సెప్టెంబర్ 27వ తేదీని దేవర ఫిక్స్ చేసుకుంది.

 Rumours Goes Viral About Game Chager Movie Release Date Details, Ram Charan , Ga-TeluguStop.com

స్టూడెంట్ నంబర్1 డేట్ కు ఈ సినిమా రిలీజ్ కానుండటం అభిమానులకు సైతం ఒకింత సంతోషాన్ని కలిగిస్తోంది.అయితే అక్టోబర్ 10వ తేదీన గేమ్ ఛేంజర్( Game Changer ) విడుదలైతే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ సినిమాకు ఆ తేదీ పర్ఫెక్ట్ డేట్ అని అభిమానులు ఫీలవుతారు.అయితే ఆ సమయానికి గేమ్ ఛేంజర్ షూట్ ను పూర్తి చేసుకుంటుందేమో చూడాల్సి ఉంది.

గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ గురించి మేకర్స్ నుంచి క్లారిటీ లేదు.ఈ సినిమా నుంచి విడుదలైన జరగండి జరగండి సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ ఎందుకు ఇంతలా ఆలస్యమవుతుందో అర్థం కావడం లేదని చరణ్ ఫ్యాన్స్ చెబుతున్నారు.ఆర్.ఆర్.ఆర్ సినిమా థియేటర్లలో విడుదలై ఇప్పటికే రెండు సంవత్సరాలు అవుతోంది.రామ్ చరణ్( Ram Charan ) కొత్త ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఆ సినిమాల షూటింగ్ ఇప్పటివరకు మొదలుకాలేదనే సంగతి తెలిసిందే.

చరణ్ రెమ్యునరేషన్ పరంగా టాప్ లో ఉన్నారు.

రామ్ చరణ్ నుంచి సైతం గేమ్ ఛేంజర్ కు సంబంధించి ఎలాంటి క్లారిటీ రాలేదు.ఈ సినిమా అంతకంతకూ ఆలస్యమైతే ఈ సినిమాపై అంచనాలు కూడా తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి.రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సత్తా చాటుతూ కెరీర్ పరంగా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube