రాజ్యసభకు మెగాస్టార్... క్లారిటీ ఇచ్చిన మెగా డాటర్ సుస్మిత?

సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.ఈ కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగా అమ్మాయిలు కూడా ఇండస్ట్రీలోకి నిర్మాతలుగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

 Mega Daughter Susmitha Comments About Chiru Political Re Entry , Chiranjeevi,sus-TeluguStop.com

ఈ క్రమంలోనే మెగా డాటర్ సుస్మిత ( Susmitha ) కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గాను అలాగే నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈమె నిర్మాణంలో తెరకెక్కిన పరువు( Paruvu ) అనే సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ప్రస్తుతం ఈ సిరీస్ జీ 5 లో ప్రసారమవుతుంది.ఈ క్రమంలోనే సుస్మిత పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

Telugu Chiranjeevi, Susmitha Chiru, Paruvu, Susmitha-Movie

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇప్పటికే తన ఫ్యామిలీ గురించి ఎన్నో విషయాలను తెలియచేసిన ఈమె తాజాగా మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) గురించి వస్తున్నటువంటి పొలిటికల్ ఎంట్రీ పై కూడా స్పందించారు.చిరంజీవి ఇటీవల ప్రజారాజ్యం పార్టీని స్థాపించి కొంతకాలం పాటు రాజకీయాలలో కొనసాగి తనకు సెట్ కావని సినిమాలలో నటిస్తున్నారు.కానీ ఇటీవల పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికలలో అద్భుతమైన మెజారిటీ సాధించారు.ఈ క్రమంలోనే నరేంద్ర మోడీ చిరంజీవికి బంపర్ ఆఫర్ ఇచ్చారని ఈయన రాజ్యసభకు వెళ్తున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి.

Telugu Chiranjeevi, Susmitha Chiru, Paruvu, Susmitha-Movie

ఇలా చిరంజీవి రాజ్యసభకు వెళ్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి.ఇందులో ఎంతవరకు నిజముందనే ప్రశ్న సుస్మితకు ఎదురయింది.ఈ ప్రశ్నకు సుస్మిత సమాధానం చెబుతూ.దాని గురించి నాకు ఎలాంటి విషయాలు తెలియవని తెలిపారు.మా కుటుంబంలో చాలా విషయాల గురించి వదంతుల గురించి చర్చలు జరుగుతుంటాయి.సోషల్ మీడియాలో వచ్చే రూమర్లు మా వరకు వస్తుంటాయని ఈమె తెలిపారు.

ఇక మేము మా ఇంట్లో ఏదైనా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే ఆ విషయం గురించే మాట్లాడుకుంటాము.గత రెండు రోజుల క్రితం బాబాయ్ ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రస్తుతం మా ఇంట్లో అందరూ కూడా ఇదే విషయం గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నామని సుస్మిత తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube