ఇటీవల మలేషియాలో( Malaysia ) ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది.యాంగ్ జింగ్షాన్, లీ షుయింగ్ ( Yang Jingshan, Li Shuying )అనే లవర్స్ కారు ప్రమాదంలో మరణించారు.
ఈ జంట మూడేళ్లకు పైగా ప్రేమికులుగా ఉన్నారు, త్వరలోనే వివాహం చేసుకోవాలని భావించారు.వారి దురదృష్టకరం కొద్దీ వైవాహిక జీవితాన్ని ఆస్వాదించక ముందే వారి ప్రాణాలు పోయాయి.
వారి కుటుంబాలు వారి పెళ్లి కోరికను నెరవేర్చడానికి, వారిని పరలోకంలో కలపడానికి ఒక ‘ఘోస్ట్ మ్యారేజ్’ వేడుకను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.
యాంగ్ జింగ్షాన్, లీ షుయింగ్ మూడేళ్లలో ప్రేమాయణంలో భవిష్యత్తు గురించి వారికి చాలా కలలు కన్నారు.కానీ యాంగ్ 2024, జూన్ 2న బ్యాంకాక్‌లో లీకి ప్రపోజ్ చేయాలని భావించాడు.కానీ దురదృష్టవశాత్తు, మే 24న వారి కారు మలేషియాలోని పెరాక్‌లోని ఒక రహదారిపై ప్రమాదానికి గురైంది, ఈ ఘటనలో వారు మరణించారు.
వారి కుటుంబాలు ఈ విషాదంతో తల్లడిల్లిపోయాయి.యాంగ్ జింగ్షాన్, లీ షుయింగ్‌ల ఆత్మలకు శాంతిని కల్పించడానికి వారు ‘ఘోస్ట్ మ్యారేజ్’ ( Ghost Marriage )అనే ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నారు.
ఇది చనిపోయిన ఇద్దరు వ్యక్తుల ఆత్మలను ఒకచోట చేర్చడానికి చేసే ఒక చైనీస్ ఆచారం.
ఈ వేడుక చాలా భావోద్వేగభరితంగా జరిగింది.యాంగ్ జింగ్షాన్, లీ షుయింగ్ ఫోటోలకు వివాహ దుస్తులు ధరించి, వారికి వివాహ వేడుక జరిపించారు.వారి కుటుంబాలు, స్నేహితులు ఈ జంట పెళ్లికి హాజరయ్యారు.
చైనా, నార్త్ కొరియా, జపాన్ వంటి ఆసియా దేశాల్లో ఈ పెళ్లిళ్లు చేయడం చట్టం అయినా సరే కొన్ని ఫ్యామిలీలు తమ సంతృప్తి కోసం వీటిని నిర్వహిస్తున్నారు.బతికి ఉన్నప్పుడు సుఖపడని ప్రేమికులకు పోస్ట్ మ్యారేజ్ చేస్తే తర్వాత జన్మలోనైనా కలుస్తారు, సుఖపడతారు అని వీళ్లు నమ్ముతారు.
ఈ పెళ్లి గురించి తెలుసుకున్న ఇతర దేశస్థులు చాలామంది ఆశ్చర్యపోతున్నారు.