ప్రేక్షకుల చేతిలో దెబ్బలు తిన్న ఆ నలుగురు స్టార్స్ వీరే !

ప్రేక్షకులు సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తారు.సినిమా నచ్చితే విజిల్స్ వేస్తారు.

 Fans Slapped Their Favourite Actor , Kangana Ranaut , Prabhas ,akshay Kumar ,ja-TeluguStop.com

మరి నచ్చితే పూలాభిషేకాలు, పాలాభిషేకాలు చేస్తారు.కానీ ఎక్కడైనా హీరోని లేదా హీరోయిన్ ని తమ ఫ్యాన్స్ కొట్టిన సందర్భాలు ఉంటాయా ? అలా జరుగుతుందా ? అంటే ఇటీవల కాలంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలను బట్టి చూస్తే ఖచ్చితంగా సెలబ్రిటీస్ ని తమ అభిమానులే కొట్టిన సందర్భాలు ఉన్నాయి.మరి ఏ సందర్భాల్లో అభిమానులు తాము ఎంతగానో అభిమానించే హీరోని లేదా హీరోయిన్ ని కొట్టారో ఆ సంఘటనలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కంగనా రనౌత్

Telugu Akshay Kumar, Jawan, Kangana Ranaut, Prabhas, Tollywood-Movie

కంగనా రనౌత్( Kangana Ranaut ) ని ఒక జవాన్ ఇటీవల కాలంలో కొట్టడం సంచలనం సృష్టించింది.గతంలో రైతులు ధర్నాలు చేస్తుంటే వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసింది అనే ఆరోపణలతో చండీగఢ్ ఎయిర్పోర్ట్ లో కంగనా విమానం ఎక్కడానికి వస్తే అక్కడే కాపలాక గస్తీ కాస్తున్న సోల్జర్ ఆమెను లాగిపెట్టి చెంప పై కొట్టింది.

అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్

బాలీవుడ్ లో ఒక మల్టి స్టారర్ సినిమాలో నటించిన అక్షయ్ కుమార్ మరియు టైగర్ ష్రాఫ్ సదరు సినిమా ప్రమోషన్స్ కోసం జనాల్లోకి వచ్చి రియల్ స్టెంట్స్ చేసే ప్రయత్నం చేయడం తో జనాలకు కారణం లేకుండానే నచ్చలేదు.దాంతో ఈ హీరోలిద్దరి పైకి చెప్పులు విసిరారు.

ప్రభాస్

Telugu Akshay Kumar, Jawan, Kangana Ranaut, Prabhas, Tollywood-Movie

ఒకసారి ఎయిర్ పోర్ట్ నుంచి వస్తున్న ప్రభాస్( Prabhas ) నీ ఆయన అభిమాని సెల్ఫి అడగగా, ప్రభాస్ కూడా బాగానే ఫోటోకు ఫోజులు ఇచ్చారు.ఫోటో బాగానే తీసుకున్నారు కానీ ప్రభాస్ అంటే పిచ్చి అభిమాన తో ఆయన చెంప పై చిన్నగా ఒక దెబ్బ కొట్టింది.దాంతో ప్రభాస్ అవాక్కయ్యాడు.

అభిషేక్ బచ్చన్

2002 లో అభిషేక్ బచ్చన్( Abhishek Bachchan ) నటించిన శరారా సినిమా రిలీజ్ అయిన సందర్భంగా థియేటర్ లో అభిమానుల మధ్య సినిమా చూడటానికి వెళ్లిన అభిషేక్ ను ఆడియెన్స్ లో ఉన్న ఒక ఓల్డ్ లేడీ కొట్టిందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube