కొత్త ఇమ్మిగ్రేషన్ విధానాన్ని ప్రకటించనున్న బైడెన్.. భారతీయులకు ప్రయోజనం

దేశ సరిహద్దుల్లో పాలసీలు, ఇమ్మిగ్రేషన్( Immigration ) విధానాలపై ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.ఆయన నిర్ణయాల కారణంగానే అక్రమ వలసదారులు దేశంలోకి ప్రవేశిస్తున్నారని రిపబ్లికన్లు మండిపడుతున్నారు.అయినప్పటికీ బైడెన్ ఇవేవీ పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.తాజాగా మంగళవారం ఆయన మరో కీలక ప్రకటన చేయనున్నారని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.అమెరికన్ పౌరుల నమోదుకానీ జీవిత భాగస్వాములకు రక్షణలను ప్రకటించనున్నారు.అమెరికాలో చట్ట విరుద్ధంగా నివసిస్తున్నప్పటికీ అమెరికన్ పౌరులను వివాహం చేసుకున్న వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చడమే బైడెన్ లక్ష్యం.

 Joe Bidens New Immigration Plan To Benefit Indians Who Living In America , Immig-TeluguStop.com

కొత్త విధానం ఇలాంటి వారిని దేశ బహిష్కరణ నుంచి కాపాడుతుంది.వర్క్ పర్మిట్‌లను మంజూరు చేయడంతో పాటు పౌరసత్వానికి మార్గాన్ని చూపుతుందని విశ్లేషకులు అంటున్నారు.

Telugu America, Benefit Indians, Green, Joe Biden, Nonimmigrant-Telugu NRI

డాక్యుమెంట్ చేయబడిన డ్రీమర్స్‌కు ఈ విధానం భవిష్యత్తులో హానిని కలిగించని ఏకైక తాత్కాలిక పరిష్కారంగా నిపుణులు చెబుతున్నారు.రాజకీయ ఒత్తిళ్ల మధ్య బైడెన్ ఇమ్మిగ్రేషన్ విధానాన్ని సమతుల్యం చేసే చర్యల మధ్య ఈ నిర్ణయం వెలువడింది.ఇప్పటికే అమెరికన్ ప్రజలు కఠినమైన నియంత్రణల కోసం పిలుపునిస్తున్నందున, కొత్త విధానం మానవీయ వలస సంస్కరణల పట్ల నిబద్ధతను చూపుతుంది.బైడెన్ ( Joe Biden )కొత్త విధానం కార్యరూపం దాలిస్తే వేలాది మంది భారతీయులకు ప్రయోజనం చేకూర్చనుంది.

అమెరికాలో ఎన్నో భారతీయ కుటుంబాలు పత్రాలు లేని సభ్యులను కలిగి ఉన్నాయి.బహిష్కరణ భయాల నుంచి కాపాడటంతో పాటు చట్టబద్ధంగా పనిచేసే సామర్ధ్యంతో పత్రాలు లేని జీవిత భాగస్వాములు తమ కుటుంబాల ఆర్ధిక పరిస్ధితులను మెరుగుపరచడంలో సహాయపడనుంది.

కాగా.అమెరికాలో హెచ్‌–1బీ, ఇతర దీర్ఘకాలిక నాన్‌–ఇమ్మిగ్రెంట్‌ వీసాదారుల పిల్లలను ‘డ్రీమర్‌’లుగా పిలుస్తారు.

ఈ చట్టబద్ధ వలసదారుల పిల్లల వయసు 21 ఏళ్లు నిండితే వారు అమెరికాలో ఉండటానికి అనర్హులు.అప్పుడు వారు అగ్రరాజ్యాన్ని వదిలి స్వదేశాలకు వెళ్లాల్సి వుంటుంది.

ఇలాంటి వారు అమెరికాలో దాదాపు 2,50,000 మంది వరకు వుంటారని అంచనా.

Telugu America, Benefit Indians, Green, Joe Biden, Nonimmigrant-Telugu NRI

భారీసంఖ్యలో డ్రీమర్ల తల్లిదండ్రులు దశాబ్దాలుగా ‘గ్రీన్‌ కార్డు’( Green Card ) కోసం నిరీక్షిస్తున్నారు.ఈ సమయంలో వారి పిల్లల వయసు 21 ఏళ్లు దాటుతోంది.దీంతో అలాంటి వారు అమెరికాను వీడిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.డ్రీమర్లు 21 ఏళ్ల వయసులోపు వరకూ డిపెండెంట్‌లుగా తమ తల్లిదండ్రులతోపాటే అమెరికాలోనే ఉండొచ్చు.21 ఏళ్లు దాటితే వారికి ఆ డిపెండెంట్‌ హోదా పోతుంది.వారిలో ఎక్కువ మంది తల్లిదండ్రులతో కలిసి చిన్నారులుగా అగ్రరాజ్యం వచ్చిన భారతీయులే ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube