ట్రైనీ ఐఏఎస్ కూతురుకు తండ్రి సెల్యూట్.. ఈ తండ్రి గుండె ఉప్పొంగిపోయిందిగా!

ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని సంఘటనలు మెమరబుల్ గా మిగిలిపోతాయి.అలాంటి ఒక సంఘటన తాజాగా చోటు చేసుకుంది.

 Ias Uma Harathi Real Life Story Telugu Details Here Goes Viral In Social Media-TeluguStop.com

ట్రైనీ ఐఏఎస్ కూతురుకు తండ్రి సెల్యూట్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.ఆ ఫోటోను చూసిన నెటిజన్లు తండ్రి గుండె ఆనందంతో ఉప్పొంగిపోయిందంటూ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.

అలా తండ్రి చేత సెల్యూట్ చేయించుకున్న ఈ యువతి పేరు నూకల ఉమా హారతి కావడం గమనార్హం.

నాలుగుసార్లు నూకల ఉమాహారతి( Nukala Uma Harathi )కి షాకింగ్ ఫలితాలు వచ్చాయి.నూకల ఉమా హారతి ఐదో ప్రయత్నంలో జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ సాధించి సత్తా చాటారు.ఉమా హారతి తండ్రి నారాయణపేట జిల్లా ఎస్పీ కావడం గమనార్హం.

ఈయన పేరు వెంకటేశ్వర్లు( Venkateshwar ) కాగా ఆయన పని చేస్తున్న చోటుకే కూతురు శిక్షణకు రావడం గమనార్హం.వెంకటేశ్వర్లు ఉమా హారతికి బొకే అందించి సెల్యూట్ చేశారు.


ఈ న్యూస్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అయింది.ఉమా హారతి 2010 సంవత్సరంలో 9.8 జీపీఏ సాధించారు.ఇంటర్ లో ఉమా హారతి 955 మార్కులు సాధించడం గమనార్హం.2017లో ఐఐటీ హైదరాబాద్( Hyderabad ) నుంచి ఉమా హారతి సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేయడం గమనార్హం.ఉమా హారతి సూర్యాపేట జిల్లా( Suryapet District ) హుజూర్ నగర్ కు చెందిన వారు కాగా ఈమె తమ్ముడు సాయి వికాస్ 2020 ఐఈఎస్ లో మంచి ర్యాంక్ సాధించి సత్తా చాటారు.

బీటెక్ తర్వాత సివిల్స్ పై దృష్టి పెట్టిన ఉమా హారతి ఢిల్లీలో ప్రముఖ కోచింగ్ సెంటర్ లో శిక్షణకు హాజరైనా అక్కడ ఆమెకు శిక్షణ నచ్చలేదు.నాకు మూడో ర్యాంక్ వస్తుందని అస్సలు ఊహించలేదని ఉమా హారతి పేర్కొన్నారు.

ఉమా హారతి చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube