చిలగడదుంప రుచిగా ఉండడమే కాదు క్లియర్ స్కిన్ ను కూడా అందిస్తుంది.. తెలుసా?

చిలగడదుంప.దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.దుంపల్లో రుచికరమైనది.అందుకే పిల్ల‌లు పెద్ద‌లు అనే తేడా లేకుండా చాలా మంది చిలగడదుంపను ఎంతో ఇష్టంగా తింటుంటారు.చిల‌క‌డ‌దంప‌ను ఉడికించి కొంద‌రు నేరుగా తీసుకుంటారు.మ‌రికొంద‌రు చిల‌క‌డ‌దుంప‌తో ర‌క‌ర‌కాల వంట‌లు చేస్తుంటారు.

 How To Get Clear Skin With Sweet Potato Details! Sweet Potato, Sweet Potato Bene-TeluguStop.com

చిల‌క‌డ‌దంపతో ఏ వంట‌కం చేసినా రుచి అదిరిపోతుంది.అలాగే చిలగడ దుంపలో ఎన్నో విలువైన పోషకాలు నిండి ఉంటాయి.

అవి మ‌న ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.అలాగే చిలగడదుంప చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతాయి.

ముఖ్యంగా క్లియర్ స్కిన్ ను అందించడానికి చిలగడదుంప గ్రేట్ గా సహాయపడుతుంది.

మరి ఇంతకీ చర్మానికి చిలకడదుంపను ఎలా ఉపయోగించాలి అన్నది ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక చిలగడదుంపని తీసుకుని నీటిలో ఉడికించి తొక్క తొలగించాలి.ఇలా పీల్ తొలగించిన చిలగడదుంపను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు చందనం పొడిని వేసుకోవాలి.

Telugu Tips, Clear Skin, Latest, Skin Care, Skin Care Tips, Sweet Potato, Sweetp

అలాగే వన్ టేబుల్ స్పూన్ శనగపిండి, రెండు టేబుల్ స్పూన్లు గ్రైండ్ చేసి పెట్టుకున్న చిలగడదుంప మిశ్రమం వేసుకోవాలి.చివరిగా సరిపడా పచ్చి పాలు పోసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి కాస్త అందంగా అప్లై చేసుకుని ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకోవాలి.

Telugu Tips, Clear Skin, Latest, Skin Care, Skin Care Tips, Sweet Potato, Sweetp

అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రెండు రోజుల‌కు ఒకసారి చిలకడదుంపతో ఈ రెమెడీని పాటిస్తే చర్మంపై మచ్చలు మొటిమలు తొలగిపోతాయి.స్కిన్ క్లియర్ అండ్ గ్లోయింగ్ గా మారుతుంది.మరియు అధిక జిడ్డు తొలగిపోయి చర్మం ఫ్రెష్ గా మారుతుంది.కాబట్టి క్లియర్ స్కిన్ ను పొందాలని ఆరాటపడుతున్న వారు తప్పకుండా చిలగడ దుంపతో పైన చెప్పిన రెమెడీని పాటించండి.అందంగా మెరిసిపోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube