చిత్ర పరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు.ఆయన మ్యూజిక్ తో కోట్లాది అందని హృదయాలను రంజిపజేశాడు.
ఇక కోటి తండ్రి సాలూరు రాజేశ్వరరావు.ఆయన మెలోడీ సాంగ్స్ కి పెట్టింది పేరు.
సాలూరి గారు ఎన్నో అద్భుతమైన పాటలను అందించారు.బాలు లాంటి గొప్ప సింగర్స్ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.
ఇక తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న కోటి కూడా కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినీ సంగీత సామ్రాజ్యంలో అగ్రపదాన నిలిచారు.
ఈ తరుణంలోనే కోటి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ , నాగార్జున వంటి టాప్ స్టార్స్ చిత్రాలకి సంగీతం అందించాడు.
ఇక కోటి తన వారసుడిని కూడా సినిమాల్లోకి తీసుకొచ్చారు.అయితే ఆయనలా సంగీతంలోకి కాకుండా తన కొడుకు రాజీవ్ ని హీరోగా ప్రేక్షకులకి పరిచయం చేశాడు కోటి.2007లో ప్రముఖ దర్శకుడు చందు డైరెక్షన్ లో వచ్చిన నోట్ బుక్మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రాజీవ్.నోట్ బుక్ తరువాత కొన్ని చిన్న చిన్న ప్రాజెక్ట్స్ లో మెరిశాడు.
నటన పరంగా కూడా రాజీవ్ కి మంచి మార్కులే పడ్డాయి.ఇంత ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నా నటుడిగా ఓకే అనిపించుకున్నా హీరోగా రాజీవ్ కి అవకాశాలు రాలేదు.
ఇక మిగతా స్టార్స్ కోసం తండ్రలు ఖర్చు చేసినట్టు కోటి కూడా తన కొడుకు కోసం కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీయలేదు.దీనితో రాజీవ్ కొన్ని రోజులు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించాడు.చివరగా తనీశ్ హీరోగా చేసిన మూవీలో కూడా రాజీవ్ కనిపించాడు.కానీ ఈ ప్రయత్నాలు ఏవి కూడా తనకి బ్రేక్ ఇవ్వకపోవడంతో.రాజీవ్ తనకి తాను చిన్న గ్యాప్ ఇచ్చుకుని ఇప్పుడు సింగర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.సంగీత నేపధ్యం ఉన్న కుటుంబం కాబట్టి రాజీవ్ చిన్ననాటి నుండే మంచి సింగర్.
మరి ఈ సెకండ్ ఇన్నింగ్స్ లోనైనా రాజీవ్ సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం.