నకిలీ కోడిగుడ్లను గుర్తుపట్టడానికి 5 మార్గాలు

నకిలీ బియ్యం అమ్ముతున్నారు, నకిలీ పండ్లను అమ్ముతున్నారు, నకిలీ చెక్కెర అమ్ముతున్నారు, నకిలీ గుడ్లని కూడా అమ్ముతున్నారు.వ్యాపారం కోసం, లాభాల కోసం తోటి మనుషులు ఆరోగ్యాన్ని అస్సలు లెక్కచేయట్లేదు వ్యాపారులు.

 Ways To Identify Fake And Chemical Eggs-TeluguStop.com

ప్లాస్టిక్ గుడ్లు ప్రస్తుతం మార్కేట్లోంచి అసలు గుడ్లలానే దుకాణాల దాకా వెళుతున్నాయి.మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కూడా నకిలీ కోడిగుడ్లని తయారుచేస్తున్నారని ఈమధ్యే వార్తల్లో చూసాం.

బెంగాల్ లో నకిలీ గుడ్లను తిని చాలామంది అనారోగ్యం పాలయ్యారు.

వీటిని అల్బుమెన్ – ఎంబ్రయో కెమికల్ రియాక్షన్ తో తయారుచేస్తున్నారు.

ఇందులో కాల్షియం కార్బోనేట్, సోడియం అల్జినేట్, జిప్సన్ లాంటి హానికరమైన కెమికల్స్‌ తో పాటు మరింత ప్రమాదకరమైన మెర్క్యూరి, బెన్జోనిక్ ఆసిడ్ కలుపుతున్నారు.ఇవి మామూలు కోడిగుడ్లలానే ఉంటాయి.

కనిపెట్టడం చాలా కష్టం, కాని అసాధ్యం కాదు.ఎలా కనిపెట్టాలో మీరే చూడండి.

* కోడిగుడ్డుని చేవుల దగ్గర పెట్టుకోని మెల్లిగా ఊపి చూడండి.నకిలీ అయితే ఏదో కలదిలినట్టుగా అనిపించడమే కాదు, సౌండ్ కూడా వస్తుంది.

అసలైన గుడ్లతో ఇలా జరగదు.

* గుడ్డు పగలగొట్టండి.

అసలు గుడ్డులో యోల్క్ వేరుపడుతుంది, కెమికల్స్‌ తో చేసిన నకిలీ గుడ్డులో మాత్రం వేరుపడదు.

* గుడ్డు పగలకొట్టకుండా స్పర్శించి చూడండి.

నకిలీ గుడ్డు టెక్చర్ కొంచెం రఫ్ గా ఉంటుంది.అసలు గుడ్డు అయితే స్మూత్ గా ఉండాలి.

* నకిలీ గుడ్డులు తెల్లగా నిగనిగలాడుతూ బాగా మెరిసిపోతాయి.అసలు గుడ్డులో అంత మెరుపు ఉండదు.

* అసలు గుడ్డు అయితే నీసు వాసన ఉంటుంది.నకిలీ గుడ్డులో ఈ వాసన ఉండదు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube