తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా సక్సెస్ అనేది కరువైంది.ఇక ప్రస్తుతం ఇప్పుడు వస్తున్న సినిమాలు డిజాస్టర్లు గా మారుతున్నాయి తప్ప సక్సెస్ ఫుల్ సినిమాగా అయితే మారడం లేదు.
ఇక అందులో భాగంగానే రీసెంట్ గా వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి( Gangs of Godavari ), మనమే లాంటి సినిమాలు కూడా పెద్దగా ఆశించిన విజయాన్ని సాధించలేదు.కానీ తమిళ్ సినిమా గా వచ్చిన మహారాజా సినిమా( Maharaja movie ) సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది.
ఇక విజయ్ సేతుపతి( Vijay Sethupathi ) ఈ సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోసాడనే చెప్పాలి.తెలుగు సినిమాలను డామినేట్ చేస్తూ ఆ సినిమా ఇక్కడ విజయం సాధించడం అనేది నిజంగా మనవాళ్ళు సిగ్గుపడాల్సిన విషయమనే చెప్పాలి.తెలుగులో వచ్చే చిన్న సినిమాలు ఎందుకు సక్సెస్ సాధించడం లేదో అర్థం కావడం లేదు.అయితే ఒక్క విషయం కనక మనం చూసుకుంటే సుధీర్ బాబు( Sudhir Babu ) హీరోగా వచ్చిన హరోం హర సినిమా అయితే ఎందుకు తీసారో కూడా తెలియదు.
ఇక ఇలాంటి నాసిరకం సినిమాలు ఎన్ని చేసినా కూడా మన హీరోలకు మంచి గుర్తింపు అయితే రాదు.కాబట్టి మంచి కథలను ఎంచుకొని బాగా తీస్తేనే సినిమాలను అవుతుంది.
ఇక ఈ మధ్య పెద్ద సినిమాలు కూడా ఏమీ లేవు కాబట్టి చిన్న సినిమాల హవా అనేది నడుస్తుంది అనుకుంటే వాళ్లు కూడా ప్లాప్ సినిమాలు తీయడం తో గత కొద్ది రోజుల నుంచి బాక్స్ ఆఫీస్ అనేది కలెక్షన్లు లేక విలవిల్లాడుతుంది.ఇక ఈ నెల చివర్లో కల్కి సినిమా వస్తుంది.కాబట్టి మరోసారి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం మొదలవబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది… చూడాలి మరి కల్కి సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుందో.