ఆ తేదీన గేమ్ ఛేంజర్ రిలీజ్ కావాలంటున్న ఫ్యాన్స్.. చరణ్ వాళ్ల కోరికను తీరుస్తారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా( Devara ) రెండు వారాలు ప్రీపోన్ కావడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

ఓజీ సినిమా( OG ) వాయిదా పడిన నేపథ్యంలో సెప్టెంబర్ 27వ తేదీని దేవర ఫిక్స్ చేసుకుంది.

స్టూడెంట్ నంబర్1 డేట్ కు ఈ సినిమా రిలీజ్ కానుండటం అభిమానులకు సైతం ఒకింత సంతోషాన్ని కలిగిస్తోంది.

అయితే అక్టోబర్ 10వ తేదీన గేమ్ ఛేంజర్( Game Changer ) విడుదలైతే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ సినిమాకు ఆ తేదీ పర్ఫెక్ట్ డేట్ అని అభిమానులు ఫీలవుతారు.

అయితే ఆ సమయానికి గేమ్ ఛేంజర్ షూట్ ను పూర్తి చేసుకుంటుందేమో చూడాల్సి ఉంది.

గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ గురించి మేకర్స్ నుంచి క్లారిటీ లేదు.ఈ సినిమా నుంచి విడుదలైన జరగండి జరగండి సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. """/" / గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ ఎందుకు ఇంతలా ఆలస్యమవుతుందో అర్థం కావడం లేదని చరణ్ ఫ్యాన్స్ చెబుతున్నారు.

ఆర్.ఆర్.

ఆర్ సినిమా థియేటర్లలో విడుదలై ఇప్పటికే రెండు సంవత్సరాలు అవుతోంది.రామ్ చరణ్( Ram Charan ) కొత్త ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఆ సినిమాల షూటింగ్ ఇప్పటివరకు మొదలుకాలేదనే సంగతి తెలిసిందే.

చరణ్ రెమ్యునరేషన్ పరంగా టాప్ లో ఉన్నారు. """/" / రామ్ చరణ్ నుంచి సైతం గేమ్ ఛేంజర్ కు సంబంధించి ఎలాంటి క్లారిటీ రాలేదు.

ఈ సినిమా అంతకంతకూ ఆలస్యమైతే ఈ సినిమాపై అంచనాలు కూడా తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి.

రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సత్తా చాటుతూ కెరీర్ పరంగా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

కల్కి 2898AD సినిమా ఎందుకు ఎంత స్పెషల్… అందులో వాడిన టెక్నాలజీలు ఏంటి..?