నిజ్జర్‌కు కెనడా పార్లమెంట్‌లో నివాళి.. ‘కనిష్క’ ఘటనను గుర్తుచేస్తూ భారత్ కౌంటర్

ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా కెనడా పార్లమెంట్‌లో ఆయనకు నివాళులర్పించడంపై భారత ప్రభుత్వం భగ్గుమంది.ఈ మేరకు వాంకోవర్‌లో భారత రాయబార కార్యాలయం ఎక్స్ (ట్విట్టర్)లో ఘాటు వ్యాఖ్యలు చేసింది.

 India's 1985 Bombing Reply Over Canadian Parliament Observes Moment Of Silence F-TeluguStop.com

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఇండియా ముందువరుసలో ఉందని.ఈ సమస్యపై పలు దేశాలతో కలిసి పనిచేస్తోందని పేర్కొంది.

ఎయిరిండియాకు చెందిన కనిష్క విమానాన్ని ఖలిస్తాన్ వేర్పాటువాదులు పేల్చేసిన ఘటనకు ఈ నెల 23కు 39 సంవత్సరాలు నిండుతాయని తెలిపింది.ఈ ఘటనలో 329 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, మృతుల్లో 86 మంది చిన్నారులేనని .సివిల్ ఏవియేషన్ హిస్టరీలోనే అత్యంత ఘోర దుర్ఘటనగా భారత రాయబార కార్యాలయం గుర్తుచేసింది.ఈ నేపథ్యంలో జూన్ 23న వాంకోవర్‌లోని స్టాన్లీ పార్క్‌లోని సెపెర్లీ ప్లేగ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఎయిరిండియా మెమోరియల్ వద్ద సంతాప కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొంది.

Telugu Kanishka, Air India, Canadian, Hardeepsingh, Malik-Telugu NRI

కాగా.1985 జూన్ 23న ఎయిరిండియా విమానం( Air India flight ) 182లో (కనిష్క) అట్లాంటిక్ మహా సముద్రంలో కూలిపోయి 329 మంది మరణించిన సంగతి తెలిసిందే.ఈ ఘటనలో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చినట్లు అనుమానితుడిగా వున్న రిపుదమన్ సింగ్ మాలిక్ 2022 జూలై 14న కెనడాలో దారుణ హత్యకు గురయ్యాడు.వాంకోవర్ సమీపంలో గుర్తు తెలియని ముష్కరులు మాలిక్‌పై కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Telugu Kanishka, Air India, Canadian, Hardeepsingh, Malik-Telugu NRI

1985లో కనిష్క విమాన ప్రమాదం సంభవించిన సమయంలో భారత్, కెనడాలలో ఖలిస్తాన్ ఉద్యమం తీవ్రంగా వుంది.ఈ ఘోర దుర్ఘటన వెనుక ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థ బబ్బర్ ఖల్సా వున్నట్లుగా అనేక అనుమానాలు, కథనాలు వచ్చాయి.అయితే ఈ ఘటనలో మాలిక్ ను దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకొన్నాయి.2005లో నిర్దోషిగా ప్రకటించబడిన తర్వాత … ఆయన పేరును బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube