తాజాగా సోషల్ మీడియాలో ఆన్లైన్ ఆర్డర్స్ ప్యాకెట్స్ లలో ఎలుకలు, పాములు, మానవ వేళ్ళు వస్తున్న వార్తలు వైరల్ అవుతున్నాయి.తాజాగా బెంగళూరుకు చెందిన ఒక జంటకు అమెజాన్ పార్సెల్ పాము వచ్చిన సంగతి వైరల్ గా మారింది.
మరోవైపు ముంబై కు చెందిన ఒక మహిళ ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఐస్ క్రీమ్ లో ఏకంగా మానవ వేలు వచ్చింది.ఇక మరోవైపు తాజాగా ఒక ఆన్లైన్ ఆర్డర్లో చనిపోయిన ఎలుక వచ్చినట్లు వార్త వైరల్ గా మారింది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.

హెర్షే అనే కంపెనీ నుండి ఓ మహిళ జెప్టో ద్వారా ఆన్లైన్లో చాక్లెట్ సిరప్ ఆర్డర్ పెట్టింది.ఆర్డర్ వచ్చిన తర్వాత హెర్షే చాక్లెట్ సిరప్ బాటిల్ ను ఓపెన్ చేసి చూడగా చనిపోయిన ఎలుకను చూసి ఒక్కసారిగా ఆ మహిళ ఆశర్యపోయింది.ఇందుకు సంబంధించిన ఓ పోస్టును ఆ మహిళ ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేయగా.
ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన కొంతమంది నెటిజన్స్ హెర్షే కంపెనీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఆ మహిళ చేసిన పోస్ట్ కు హర్షి కంపెనీ బ్రాండ్ స్పందిస్తూ ఇలా రాసుకు వచ్చింది.“హాయ్, దీన్ని చూసి మేము చాలా చింతిస్తున్నాము.దయచేసి మాకు యూపీసీ, తయారీ కోడ్ ను బాటిల్ నుంచి consumercare@hersheys.com కు రిఫరెన్స్ నంబర్ 11082163తో పంపండి, దాని ద్వారా మా బృంద సభ్యులలో ఒకరు మీకు సహాయం చేయగలరు” అంటూ తెలిపింది.

అంతేకాకుండా ఆ మహిళ తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో వీడియో పోస్ట్ చేసి దాని కింద వివరాలు కూడా తెలియజేశారు.ఆ మహిళ ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో జెప్టో ఆర్డర్లో చాక్లెట్ సిరప్ ను ఒక కప్పులో పోయగా అందులో ఒక చనిపోయిన ఎలుక వచ్చిందని, అలాగే ఆ చాక్లెట్ సిరప్ ను బ్రౌనీ కేక్ లతో తినడానికి ఆర్డర్ చేసుకున్నామని తెలిపింది.అయితే సిరప్ ను కేకుపై కోస్తుండగా నల్లగా వెంట్రుకల లాంటి పదార్థం వచ్చిందని, ఈ తరుణంలోనే ఆ సిరప్ డిస్పోసల్ గ్లాస్ లో పోసి చూడగా చనిపోయిన ఎలుకగా గుర్తించామని ఆ మహిళ తెలియజేశారు.
ఇక ఈ వీడియో చూసిన కొంతమంది నెటిజన్స్ ఇలాంటి కంపెనీస్ పై ఆహార భద్రత డిపార్ట్మెంట్స్ కు ఫిర్యాదు చేయాలని సలహా ఇచ్చారు.