18 ఏళ్లుగా కష్టాలను ఫేస్ చేసిన ఎన్టీఆర్ సినిమా.. చివరికి రిలీజైంది కానీ..??

సీనియర్ ఎన్టీఆర్( Senior NTR ) నటించిన ప్రతి తెలుగు సినిమాలో తన పాత్రకు తానే డైలాగుల డబ్బింగ్ చెప్పారు కానీ ఒక్క సినిమాలో మాత్రం అలా జరగలేదు.నిజానికి ఎన్టీఆర్ వాయిస్ లో ఒక మ్యాజిక్ ఉంటుంది.

 Ntr Hardwork For Failure Movie ,errakota Veerudu , Ntr ,ntr Hardwork , Toll-TeluguStop.com

అది మాత్రమే అతని కటౌట్‌కు, తన క్యారెక్టర్లకు బాగా సూట్ అవుతుంది.అదే ఆయనకు వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్తే ప్రేక్షకులు వినలేరు.ఆ కారణంగానే ఎన్టీఆర్ నటించిన “ఎర్రకోట వీరుడు( Errakota Veerudu )” సినిమా ఫ్లాప్ అయ్యింది.1955లో ఈ మూవీ నిర్మాణం ప్రారంభం కాగా 1973లో రిలీజ్ అయింది.అంటే ఇది పూర్తి కావడానికి 18 ఏళ్లు సమయం పట్టింది.అంతకాలంపాటు ఈ మూవీకి అడ్డంకులు ఏర్పడ్డాయి.

Telugu Ntr Hardwork, Saroja Devi, Savitri, Gopalakrishna, Tollywood-Movie

1955లో H.M రెడ్డి గజదొంగ టైటిల్‌తో ఎన్టీఆర్, సావిత్రి , బి సరోజాదేవిలను ప్రధాన నటులుగా ఎంపిక చేసుకొని సినిమా స్టార్ట్ చేశారు.ఇందులో రాజనాల, ఆర్ నాగేశ్వరరావులను ప్రతి నాయకులుగా తీసుకున్నారు.సినిమా షూటింగ్ 50% కంప్లీట్ అయ్యాక ప్రొడ్యూసర్ HM రెడ్డి మరణించారు.దాంతో సినిమా అర్థంతరంగా నిలిచిపోయింది.ఎన్టీఆర్ సినిమా ఇలా మధ్యలో ఆపు చేయడం బాగోదని దాన్ని మరొకరు పునఃప్రారంభించారు.

షూటింగ్ స్టార్ట్ అయిన కొన్ని నెలలకే ఆర్ నాగేశ్వరరావు కన్నుమూసారు.ఫలితంగా మరోసారి షూటింగ్‌కు బ్రేక్ పడింది.

ఆర్.నాగేశ్వరరావు రోల్‌ను తమిళ నటుడు నంబియార్ని భర్తీ చేయడంతో మళ్లీ షూటింగ్ మొదలైంది.ఈసారి డైరెక్టర్ కూడా చేంజ్ అయిపోయారు. వైఆర్ స్వామి ఈ సినిమాని డైరెక్ట్ చేయలేనని చేతులెత్తేశారు.అప్పుడు పార్థసారథి దర్శకత్వ బాధ్యతలను తన భుజాలకు ఎత్తుకున్నారు.అంతేకాదు మూవీ టైటిల్‌ను “ధర్మ విజయం”గా చేంజ్ చేశారు.

ఆయన చాలా పట్టుదలతో షూటింగ్ కంప్లీట్ చేయగలిగారు కానీ పోస్ట్ ప్రొడక్షన్‌లో ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి.దాంతో 18 ఏళ్ల పాటు ఈ సినిమా గురించి ఒక్కరు కూడా పట్టించుకోలేదు.

Telugu Ntr Hardwork, Saroja Devi, Savitri, Gopalakrishna, Tollywood-Movie

ఈ మూవీలో నటించిన అందరూ పెద్ద నటులే కాబట్టి ప్రొడ్యూసర్ టి గోపాలకృష్ణ ( T Gopalakrishna )దానిని కంప్లీట్ చేయడానికి ధైర్యం చేశారు.పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశారు కానీ 18 ఏళ్ల తర్వాత పాత్రకు డబ్బింగ్ చెప్పమని ఎన్టీఆర్‌ని అడగలేకపోయారు.భయమో లేదంటే మొహమాటమో ఆయన ఎన్టీఆర్ ని కాంటాక్ట్ అవ్వలేక డబ్బింగ్ ఆర్టిస్ట్ దశరధరామిరెడ్డిని పిలిపించుకున్నారు.అతని చేతే డబ్బింగ్ చెప్పించి రిలీజ్ చేశారు.అయితే విడుదల చేసే ముందు టైటిల్‌ను “ఎర్రకోట వీరుడు”గా మార్చారు.తమిళంలో “తిరుడడే తిరుడన్” టైటిల్ తో రిలీజ్ చేశారు.

ఇది ఎన్టీఆర్ సినిమా కావడంతో జనాలు థియేటర్లకు పోటెత్తారు.తీరా ఎన్టీఆర్ గొంతుకు బదులుగా వేరే గొంతు వినిపించడంతో చాలామంది షాక్ అయ్యారు.

ఆ సినిమాని కొద్దిసేపు కూడా చూడలేకపోయారు.అందుకే ఆ మూవీ ఫ్లాప్ అయ్యింది ఇందులోనే ఒక పాట కూడా ప్రేక్షకులకు నచ్చలేదు.

ఇంత కష్టపడి తీసినా ఈ మూవీ చివరికి దారుణంగా ఫెయిల్ అయిపోయింది, చాలామందికి నష్టాలు కలిగించింది.ఎర్రకోట వీరుడు సినిమాను యూట్యూబ్ లో చూసి ఎన్టీఆర్ పాత్ర గొంతు ఎలా ఉందో వినవచ్చు.

ఏదేమైనా ఎన్టీఆర్ ఆ మూవీకి వాయిస్ అందించి ఉంటే మూవీ ఫలితం మరోలా ఉండేదేమో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube