ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తాప్సీ ( Taapsee Pannu )కెరీర్ మొదలైంది.ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా అందం, అభినయంతో మెప్పించడం తాప్సీకి ప్లస్ అయింది.
కొంతమంది స్టార్స్ కు సైతం జోడీగా నటించిన తాప్సీ తర్వాత రోజుల్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో విజయాలు సాధించడంతో ఈ ఇండస్ట్రికి దూరమయ్యారు.టాలీవుడ్ ఇండస్ట్రీపై ఈ బ్యూటీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.

అయితే బాలీవుడ్ ఇండస్ట్రీ( Bollywood industry )లో తనకు ఆఫర్లు రావడం గురించి ఈ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నేను ప్రీతి జింటా( Preity Zinta )కు న్యూ వెర్షన్ అని చాలామంది భావిస్తారని ఆమె పేర్కొన్నారు.ఆ రీజన్ వల్లే నాకు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్లు వస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.ప్రీతి జింటా ఎంత పాజిటివ్ ఎనర్జీతో ఉంటారో అందరికీ తెలుసని నేను బాలీవుడ్ లో ఉండటానికి కారణమైన కీర్తికి అపకీర్తికి తీసుకురానని తాప్సీ పేర్కొన్నారు.

ప్రీతి జింటాలా ప్రేక్షకులను అలరించడానికి ఎల్లప్పుడూ కష్టపడుతూనే ఉంటానని తాప్సీ వెల్లడించారు.బీటెక్ చదివే సమయంలో టాలీవుడ్, కోలీవుడ్ నుంచి మంచి ఆఫర్లు వచ్చాయని ఆమె చెప్పుకొచ్చారు.తెలుగులో తాప్సీ నటించిన చివరి మూవీ మిషన్ ఇంపాజిబుల్( Mishan Impossible ) కాగా ఈ సినిమా కథ, కథనం బాగానే ఉన్నా వేర్వేరు కారణాల వల్ల ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేదు.కొన్నిరోజుల క్రితం తాప్సీ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
తన వైవాహిక జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను సైతం ఆమె వెల్లడించారు.ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మూడు ప్రాజెక్ట్ లతో ఈ బ్యూటీ బిజీగా ఉన్నారని తెలుస్తోంది.
తాప్సీ పారితోషికం పరిమితంగానే ఉందని తెలుస్తోంది.తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండి తెలుగులో మరింత బిజీ కావాలని ఆమె అభిమానులు ఫీలవుతున్నారు.