దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఈవీఎంల పనితీరుపై నెగిటివ్ కామెంట్లు వస్తున్న సంగతి తెలిసిందే.ఇటీవల ఎలాన్ మాస్క్( Elon Musk ) సైతం ఈవీఎం పనితీరుపై నెగెటివ్ కామెంట్లు చేశారు.
ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని పేర్కొన్నారు.దేశవ్యాప్తంగా ఈవీఎం ట్యాంపరింగ్ విషయంపై చర్చ జరుగుతుంది.
ఇదే సమయంలో ఇటీవల ముంబై నార్త్ వెస్ట్ ఎన్నికలలో ఈవీఎం ట్యాంపర్ చేశారు.అని ఆరోపణలు రావటం జరిగాయి.
ఇదిలా ఉంటే ఏపీ ఎన్నికలలో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం పట్ల కూడా ఆ పార్టీ నేతలు ఈవీఎం ట్యాంపరింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.వైసీపీ అధినేత వైయస్ జగన్ సైతం ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్ కూడా పెట్టడం జరిగింది.

ప్రపంచం మొత్తం మీద ప్రజాస్వామ్యం కొనసాగుతున్న అత్యధిక దేశాలలో ఎన్నికల ప్రక్రియ కోసం పేపర్ బ్యాలెట్లు వాడుతున్నారు. ఈవీఎంలు కాదు.ప్రజాస్వామ్యం అసలైన స్ఫూర్తిని కొనసాగించేందుకు మనం కూడా ఇదే దిశగా ముందుకు సాగాలి అని పోస్ట్ పెట్టడం జరిగింది.సిపిఐ నారాయణ ( CPI Narayana )సైతం.స్పందించారు.122 దేశాలలో ఈవీఎంలు వినియోగించడం లేదు.చాలా దేశాల్లో బ్యాలెట్ పేపర్లనే వినియోగిస్తున్నారు.ప్రపంచ దేశాలకు ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయి.మనదేశంలో మాత్రం అనుమానాలను ఆరోపణలను పట్టించుకోవడం లేదు.అందుకే వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించకూడదు పేపర్ బ్యాలెట్స్ ద్వారా ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు.
ఇదే విషయంపై తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్( Addanki Dayakar ) స్పందించడం జరిగింది.ఈవీఎంల పనితీరుపై ఎలాన్ మాస్క్ వ్యాఖ్యలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని పేర్కొన్నారు.
కేంద్రానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా… ఉన్నత స్థాయి విచారణ జరపాలి.ఈవీఎంల వల్ల భారత ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు వాటిల్లుతుంది.
వాటి సామర్థ్యాన్ని మన దేశం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.టెక్నాలజీతో ఈవీఎంలను హ్యాకింగ్, టాంపరింగ్ చేసే అవకాశం ఉంది.
బ్యాలెట్ పద్ధతే ప్రజాస్వామ్యానికి మంచిది అని తెలిపారు.