పంజాబీ ఎన్ఆర్ఐ జంటపై దాడి .. ఖండించిన హిమాచల్‌ప్రదేశ్ సీఎం, దర్యాప్తు ఆదేశం

పంజాబీ సంతతికి చెందిన ఎన్ఆర్ఐ జంటపై( NRI Couple ) తమ రాష్ట్రంలో దాడి జరగడాన్ని ఖండించారు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీర్ సింగ్ సుఖు.( CM Sukhvinder Singh Sukhu ) ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు.

 Himachal Pradesh Cm Sukhvinder Singh Sukhu Condemns Attack On Punjabi Nri Couple-TeluguStop.com

హిమాచల్ ప్రదేశ్( Himachal Pradesh ) ప్రకృతి సౌందర్యం, గొప్ప సంస్కృతికి , మతపరమైన పుణ్యక్షేత్రాలకు ప్రసిద్ధి చెందిందని సీఎం సుఖు అన్నారు.ప్రతి ఏడాది కోట్లాది మంది పర్యాటకులను రాష్ట్రం ఆకర్షిస్తోందని, ఈ ఘటన రాష్ట్రంపై ప్రతిబింబించదని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

ఎప్పటిలాగే హిమాచల్ ప్రదేశ్ సందర్శకులకు సురక్షితమైన కేంద్రంగా ఉంటుందన్నారు.

Telugu Cmsukhvinder, Condemns Attack, Dalhousie, Kangana Ranaut, Khajjiar, Kulde

ఖజ్జియార్‌లో( Khajjiar ) ఎన్ఆర్ఐ దంపతులపై దాడికి సంబంధించిన కేసుపై అమృత్‌సర్‌లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసిందని రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు.హిమాచల్ పోలీసులు అమృత్‌సర్ పోలీస్ స్టేషన్ నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారని, నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.జూన్ 11వ తేదీ ఉదయం డల్హౌసీలోని( Dalhousie ) పార్కింగ్ ప్లేస్‌లో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని ప్రతినిధి చెప్పారు.

పోలీసులు రంగప్రవేశం చేసి గాయపడిన ఎన్ఆర్ఐ జంటను చంబా ఆసుపత్రికి తరలించారని తెలిపారు.దంపతులకు వైద్య పరీక్షలు చేసినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేసేందుకు నిరాకరించారని, ఇరువర్గాలు రాజీకీ అంగీకరించాయని ఆయన పేర్కొన్నారు.

Telugu Cmsukhvinder, Condemns Attack, Dalhousie, Kangana Ranaut, Khajjiar, Kulde

మరోవైపు.హిమాచల్‌ప్రదేశ్‌లో ఎన్ఆర్ఐ జంటపై స్థానికులు దాడి చేసిన ఘటన పంజాబ్‌లో( Punjab ) కలకలం రేపుతోంది.అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ప్రభుత్వం ఈ ఘటనపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది.ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్ దగ్గరుండి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు.

అమృత్‌సర్ గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులపై ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.బాధితులను కన్వల్‌జీత్ సింగ్ (26),( Kanwaljeet Singh ) అతని స్పానిష్ భార్య యోలానాలా గార్సియో గోజాలెస్‌గా( Yolanala Garcia Gozzales ) గుర్తించారు.

వీరు గత 25 సంవత్సరాలుగా స్పెయిన్‌లో నివసిస్తున్నారు.రెండు వారాల క్రితం వారు కొన్ని వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి పంజాబ్ వచ్చారు.ఈ నేపథ్యంలోనే ఈ జంట హిమాచల్ ప్రదేశ్‌లోని డల్హౌసీ, ఖజ్జియార్‌ ట్రిప్ ప్లాన్ చేశారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube