అభిమాని కుటుంబాన్ని ఆదుకున్న మహేష్ బాబు.. రియల్ లైఫ్ లో కూడా సూపర్ స్టార్ అంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కడానికి ఆయా హీరోల ప్రతిభతో పాటు అభిమానులు కూడా ఒక విధంగా కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి( Rajamouli ) సినిమాతో బిజీగా ఉన్నారు.

 Super Star Mahesh Babu Help To Fan Family Details Here Goes Viral In Social Medi-TeluguStop.com

ఈ ఏడాదే ఈ సినిమా మొదలు కానుండగా ఈ సినిమా విడుదలకు కనీసం మూడు సంవత్సరాల సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి.

అయితే తాజాగా అభిమాని కుటుంబాన్ని మహేష్ బాబు( Mahesh Babu ) ఆదుకోగా అందుకు సంబంధించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండటం గమనార్హం.మహేష్ మరోసారి తన మంచి మనస్సును చాటుకోవడం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.చావు బ్రతుకుల్లో ఉన్న అభిమాని కుటుంబాన్ని ఆదుకున్న మహేష్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.

కృష్ణా జిల్లా( Krishna District)లోని పెదప్రోలు గ్రామానికి చెందిన కాకర్లమూడి రాజేశ్ మహేష్ కు వీరాభిమాని కాగా ఇతర భార్య పేరు సుజాత.ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.మొదట కృష్ణకు వీరాభిమాని అయిన రాజేశ్ తర్వాత రోజుల్లో మహేశ్ కు అభిమాని కావడం జరిగింది.మహేష్ సినిమాల పేర్లను పిల్లలకు పెట్టాడంటే ఈ అభిమాని అభిమానం ఏపాటిదో అర్థమవుతుంది.

రాజేశ్ కిడ్నీ సమస్యలతో మంచానికే పరిమితం కాగా అర్జున్ చెప్పుల షాప్ లో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.రాజేశ్ పరిస్థితి తెలుసుకున్న మహేశ్ బాబు తన టీమ్ ను ఆ ఊరికి పంపి రాజేశ్ పిల్లలను మంచి స్కూల్ లో చేర్పించారు.

ఆ విద్యార్థుల విద్యకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.ఈ విషయం తెలిసిన నెటిజన్లు సూపర్ స్టార్ మహేశ్ మంచి మనస్సును ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube