ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన చంద్రబాబు ప్రభుత్వం పాలనపరంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది.ఈ క్రమంలో ప్రభుత్వ యంత్రాంగంలో పూర్తిగా ప్రక్షాళన కార్యక్రమం చేపడుతూ.

 Massive Transfer Of Ias In Andhra Pradesh Ias, Andhra Pradesh, Cm Chandrababu ,-TeluguStop.com

కొంతమంది అధికారులపై చర్యలు తీసుకుంటూ ఉంది.ఇదే సమయంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల పేర్ల మార్పు వంటి పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.విషయంలోకి వెళ్తే ఏపీలో భారీగా ఐఏఎస్ లు బదిలీ అయ్యారు.

పురపాలకశాఖ, ఎక్సైజ్, పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శులు శ్రీలక్ష్మి, రజత్ భార్గవ,( Rajat Bhargava ) ప్రవీణ్ ప్రకాశ్ ను ప్రభుత్వం జీఏడీకి అటాచ్ చేసింది.జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ కుమార్లను నియమించింది.వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్, కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్విదేవి నియమించడం జరిగింది.పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్, సివిల్ సప్లై కమిషనర్ గా సిద్ధార్థ్ జైన్, సీఆర్డీఏ కమిషనర్ గా కాటమనేని భాస్కర్, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్, ఉద్యాన, మత్స్య, సహకార కార్యదర్శిగా అహ్మద్ బాబు లను నియమించడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube