18 ఏళ్ల తర్వాత టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తున్న ప్రముఖ నటి.. కల్కి ఆమెకు ప్లస్ అవుతుందా?

ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమా( Kalki 2898 AD ) మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే సెన్సార్ ఫార్మాలిటీస్ ను ఈ సినిమా పూర్తి చేసుకోగా ఈ సినిమా కోసం అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Shobhana Re Entry In Tollywood Industry With Kalki Movie Details Here Goes Vira-TeluguStop.com

ఈ సినిమాతో 18 సంవత్సరాల తర్వాత శోభన తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్నారని సమాచారం అందుతోంది.శోభనకు కల్కి మూవీ ప్లస్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.

నటి శోభనకు సంబంధించిన లుక్ ను మేకర్స్ తాజాగా విడుదల చేయగా ఆ లుక్ నెట్టింట వైరల్ అయింది.శోభన( Shobhana ) ఈ సినిమాలో భాగం కావడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.శోభన పోస్టర్ కు కల్కి మేకర్స్ ఆమె పూర్వీకులు కూడా ఆమెలాగే వేచి ఉన్నారు అనే క్యాప్షన్ ను జోడించడం గమనార్హం.2006 సంవత్సరంలో విడుదలైన గేమ్ సినిమాలో చివరిసారిగా ఆమె నటించారు.

మరోవైపు ఈరోజు సాయంత్రం ముంబైలో కల్కి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని సమాచారం అందుతోంది.కల్కి 2898 ఏడీ సినిమాకు ఇప్పటికే ఊహించని స్థాయిలో బిజినెస్ జరిగిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.నిర్మాణ సంస్థ అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ ఈవెంట్ ను వీక్షించవచ్చు.కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు జరగనుందో స్పష్టత రావాల్సి ఉంది.

కల్కి సినిమాలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించనుండగా అమితాబ్( Amitabh Bachchan ) అశ్వథ్థామ రోల్ లో కనిపించనున్నారు.ఈ సినిమా కోసం నిర్మాతలు 600 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.ఈ సినిమాకు బిజినెస్ సైతం భారీ స్థాయిలో జరిగింది.కల్కి2 గురించి సైతం సినిమా రిలీజ్ తర్వాత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.కల్కి సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube