ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun )నటించిన పుష్ప 2( Pushpa 2 )సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ ఈ సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇక ఈయనకు దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో అభిమానులు కూడా పెరిగిపోయారు.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో పుష్ప 2 సినిమాని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.
ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావచ్చింది.
ఇక ఈ సినిమా ఆగస్టు 15 వ విడుదల కాబోతుందని మేకర్స్ వెల్లడించారు .దీంతో అభిమానులందరూ కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూశారు.అయితే ఉన్న ఫలంగా ఈ సినిమా వాయిదా( Post pone ) పడుతూ డిసెంబర్ 6 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని వెల్లడించారు.
ఈ క్రమంలోనే అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఏకంగా చిత్ర బృందాన్ని బెదిరిస్తూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా వాయిదా పడింది అంటూ కొత్త డేట్ ప్రకటిస్తూ అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్ పై ఒక అభిమాని స్పందిస్తూ తమాషా చేస్తున్నారా మీకు చాలా జోక్ గా ఉంది.ఈ సినిమాని జూలై నెలలో విడుదల చేస్తామని చెప్పారు, తిరిగి ఆగస్టు అన్నారు.ఇప్పుడు డిసెంబర్ అంటున్నారు.
ఆడియన్స్ ఎమోషన్స్ తో ఆడుకుంటారా.పుష్పకమ్యూనిటీ అంతాకలిసి త్వరగా సినిమా రిలీజ్ చేయమని కోర్టులో కేసు ఫైల్ చేస్తాను అన్నారు.
ఈయన కోర్టుకు వెళ్లడం ఏమో కానీ ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారని, సినిమా వాయిదా పడటంతో చాలా నిరుత్సాహ పడ్డారని మాత్రం స్పష్టంగా అర్థం అవుతుంది.